మెగా ఫ్యామిలీలో ఉండే బంధాల గురించి అందరికీ తెలిసిందే. ఏదైనా ఈవెంట్ జరిగినా, పండుగలకు మెగా ఫ్యామిలీ అంతా ఒక్క చోటకే చేరుతుంది. మనకు వారంతా హీరోల్లా అనిపించినా, కనిపించినా వారంతా కజిన్స్. వారి మధ్య ఉండే అనుబంధాలు, ప్రేమలు, ఆప్యాయతలు వారికుంటాయి. ఇక తాజాగా సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ బర్త్ డే సందర్భంగా నిహారిక స్పెషల్ విషెస్ చెప్పింది.
బావా బంగారు అంటూ అదిరిపోయే ఫోటోను షేర్ చేసింది. అయితే వరుసకు వీరు బావా మరదళ్లే అయినా అందరూ ఒకే చోట పెరగడంతో అలాంటి ఫీలింగ్ ఏమీ ఉండదట. అందుకే ఆ మధ్య వీరిద్దరికి పెళ్లి కాబోతోందని వచ్చిన రూమర్లపై అందరూ ఫైర్ అయ్యారు. మరీ ప్రత్యేకంగా నాగబాబు ఓ రేంజ్‌లో విరుచుకు పడ్డాడు. వారికి అలాంటి ఫీలింగ్ ఉండదని, బ్రదర్స్ అండ్ సిస్టర్స్‌లానే ఉంటారని తెలిపాడు.
పైగా అల్లు ఫ్యామిలీ నుంచి కూడా బన్నీ నిహారికను తల్లి, చెల్లి అనే పిలుస్తాడు. అలా అందరూ ఒకే చోట ఉండటం మూలానే అంత సాన్నిహిత్యం ఏర్పడి ఉంటుంది. తాజాగా నిహారిక సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్‌కు విషెస్ చెబుతూ షేర్ చేసిన పిక్ ఎంతో క్యూట్‌గా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి ఈ ఇద్దరికి పెళ్లిళ్లు కాబోతోన్నాయని సమాచారం. ఇందులో నిహారిక-చైతన్య నిశ్చితార్థం కూడా అయిపోయింది. సాయి ధరమ్ తేజ్ పెళ్లి కూడా ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. కానీ పూర్తి వివరాలను మాత్రం ఇంకా వెల్లడించడం లేదు.