ఆయన్ని బుట్టలో పడేయటం చాలా తేలిక అంటూ చిరంజీవి గురించి నిహారిక కామెంట్స్..?

మెగా బ్రదర్ నాగబాబు కూతురు కొణిదెల నిహారిక గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈటీవీలో ప్రసారమవుతున్న ఢీ షోలో హోస్టుగా తన కెరీర్ ప్రారంభించిన నిహారిక బుల్లితెర మీద ప్రసారమైన ఎన్నో టీవీ షోస్ లో సందడి చేసింది. అంతేకాకుండా మెగా కుటుంబంలో ఉన్న రూల్ ని కూడా బ్రేక్ చేస్తూ హీరోయిన్ గా ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. అయినప్పటికీ ఆమె హీరోయిన్ గా నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద హిట్ కాలేకపోయాయి. అందువల్ల సినిమాలకు గ్యాప్ ఇచ్చి జొన్నలగడ్డ చైతన్యని వివాహం చేసుకుంది.

అయితే చైతన్యతో వివాహం జరిగిన తర్వాత నిహారిక ఇండస్ట్రీలో కనిపించదని వార్తలు వినిపించాయి. కానీ నిహారిక సినిమాలలో కాకుండా తన భర్త సహకారంతో వెబ్ సిరీస్ లో నటిస్తూ వాటిని నిర్మిస్తూ నిర్మాతగా కూడా మారింది. ప్రస్తుతం నిహారిక ఈ వెబ్ సిరీస్ పనులతో బిజీగా ఉంది. ఇదిలా ఉండగా గతంలో నిహారిక తన భర్తకి విడాకులు ఇవ్వబోతుందని వార్తలు వినిపించాయి. అయితే ఆ రూమర్లలో నిజం లేదని వారు క్లారిటీ ఇచ్చారు. తాజాగా నిహారిక మరొకసారి బుల్లితెర మీద సందడి చేసింది. ఈటీవీలో ప్రసారమవుతున్న క్యాష్ షోలో మెరిసింది.. ఈ షో లో నీహారికతో పాటు యూట్యూబర్స్ నిఖిల్, అనిల్, దేవుళ్ళు ఫేమ్ నిత్యా శెట్టి హాజరయ్యారు.

ఈ షో లో వీరు నలుగురు కలిసి సుమతో చేసిన ఫన్ అంతా ఇంతా కాదు. ఈ షోలో నిహారిక చిరంజీవి గురించి ఒక సీక్రెట్ రివీల్ చేసింది. స్కిట్లో భాగంగా సుమ బబుల్స్ ఊపుతూ వీటిలో 5 బబుల్స్ పట్టుకొకపోతే నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాలి అంటూ..నీ మాటలతో, చేతలలో, చేస్థలతో చిరంజీవి, పవన్ కళ్యాణ్ లలో ఎవరిని తొందరగా కరిగిస్తావని ప్రశ్న అడిగింది. నిహారిక 5 బబుల్స్ పట్టుకొకపోవటంతో సుమ ప్రశ్నకు సమాధానం చెబుతూ.. మాటలతో కరిగించాలి అంటే పెదనాన్న చిరంజీవిని ఈజీగా కరిగించవచ్చు అని సమాధానం చెప్పింది. వెంటనే యూట్యూబర్ నిఖిల్ స్పందిస్తూ.. బ్రేకింగ్ న్యూస్ ఎన్నీ ప్రయత్నాలు చేసినా బుట్టలో పడని పవన్ కళ్యాణ్ అని అంటాడు. ఇటీవల విడుదలైన ఈ క్యాష్ ప్రోమో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.