ఏంటి మందు పార్టీనా అది… నిహారిక, లావణ్య త్రిపాఠి, రితూ వర్మ హల్చల్

Niharika Ritu Varma And Lavanya Tripathi Enjoys In Party

నిహారిక ఈ మధ్య పార్టీల మీద పార్టీలు చేసుకుంటోంది. ఇక పెళ్లి ఎలాగూ అయిపోతోంది కదా అని మధ్యలో ఉన్న ఈ సమయాన్ని తెగ ఎంజాయ్ చేస్తోన్నట్టు కనిపిస్తోంది. ఈ మధ్యే గోవాకు వెళ్లింది. తన ఫ్రెండ్స్ అందరూ కలిసి ఆమెకు సర్ ప్రైజ్ ఇచ్చినట్టు కనిపిస్తోంది. మొత్తానికి అక్కడ తన స్నేహితుల గ్యాంగ్‌తో గోవాలో దుమ్ములేపింది. మూడు నాలుగు రోజులు గోవాలో హల్చల్ చేసి హైద్రాబాద్‌కు వచ్చింది.

Niharika Ritu Varma And Lavanya Tripathi Enjoys In Party
Niharika Ritu Varma And Lavanya Tripathi Enjoys In Party

ఇక్కడకు వచ్చాక మళ్లీ తన ఫియాన్సీ చైతన్యతో కలిసి బయటకు వెళ్లింది. చూస్తుంటే అది రెస్టారెంట్‌లానే కనిపిస్తోంది. అందులో నిహారిక వేసుకున్న డ్రెస్, అందులోని హాట్ నెస్‌కు అందరూ ఫిదా అయ్యారు. తాజాగా నిహారిక మరో పార్టీలో ముగిని తేలినట్టున్నారు. ఈ పార్టీలో ముఖ్యంగా లావణ్య త్రిపాటి, రీతూ వర్మ కనిపించారు. ఈ ముగ్గురితో పాటు మరో స్నేహితురాలు కూడా ఉంది. అయితే ఈ వీడియోలో కొన్ని మాత్రం బాగానే హైలెట్ అవుతున్నాయి.

Niharika Ritu Varma And Lavanya Tripathi Enjoys In Party
Niharika Ritu Varma And Lavanya Tripathi Enjoys In Party

నిహారిక, లావణ్యలు జిమ్ పార్ట్నర్స్ కావడంతో మరింత సన్నిహితులైనట్టు కనిపిస్తోంది. ఇక తమ స్నేహితురాలికి పెళ్లి కాబోతోండటంతో అందరూ కలిసి గ్రాండ్ పార్టీ ఇచ్చినట్టు కనిపిస్తోంది. ఇందులో భాగంగా ఇళ్లంగా బాగా డెకరేట్ చేశారు. బెలూన్లతో నింపేశారు. ఓ నాలుగు గ్లాసులు కూడా పెట్టి ఉంచారు. చూస్తుంటే వీరు మందు పార్టీలో మునిగి తేలినట్టుంది. మొత్తానికి ఇలా ఈ ముగ్గురు హీరోయిన్లు మాత్రం బాగానే రచ్చ చేశారు.