Varun Tej: మెగా ఫ్యామిలీ మరోసారి వార్తల్లో నిలిచింది. ఇటీవల ఓ పబ్ రైడ్‌లో నాగబాబు కూతురు నిహారిక కూడా ఉండడం అందర్నీ షాక్‌కు గురిచేసింది. ఆమెతో పాటు పలువురు సినీ, రాజకీయ నాయకుల పిల్లలు కూడా ఉండడం ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే మెయిన్‌గా ప్రముఖ మీడియా ఛానెళ్లలోనూ వీరి పేర్లు బయటికి రావడంతో అందరూ అలర్ట్ అయ్యారు. ఇక తన కూతురు ఇలా పబ్‌లో పట్టుబడ్డ వ్యవహారంపై ఇప్పటికే నాగబాబు కూడా నిహారిక తప్పేం లేదని వీడియోరూపంలో తెలియజేశారు. ఆ తర్వాత ఆమెకు నోటీసులు పంపించి, ఇంటికి పంపించారు. కానీ ఎప్పుడు పిలిచినా విచారణకు రావల్సిందేనంటూ పోలీసులు ఆంక్షలు పెట్టారు.
అయితే ఇప్పుడు నిహారిక చేసిన ఘనకార్యం వల్ల ఇటీవల తన అన్న వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన గని సినిమాకు ఇబ్బందులు తప్పవంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. దాంతో హీరో వరుణ్ తేజ్ సందిగ్ధంలో పడ్డట్టు తెలుస్తోంది. దాదాపు రెండు సంవత్సరాలు ఎంతో కష్టపడి భారీ బడ్జెట్‌లో తీసిన ఈ సినిమా మరికొద్ది రోజుల్లో విడుదలవుందనగా ఇలాంటి చిక్కులు ఎదురవడం వరుణ్‌ని ఆందోళనల్లో పడేసినట్టు కనిపిస్తోంది. అతను ఈ సినిమా కోసం ఎంత శ్రమించాడో ఆ ఒక్క ట్రైలర్‌లోనే తెలుస్తోంది. అలాంటిది ఇప్పుడు తన చెల్లెలు నిహారిక వల్ల గని మూవీకి ఇబ్బందులు వస్తాయేమోని అంతా టెన్షన్ పడుతున్నారు.
నిహారిక పట్టుబడిన పబ్ రైడ్ వ్యవహారంలో మత్తు పదార్థాలు దొరకడమే ఈ కేసులో కీలకంగా తోస్తోంది. ప్రస్తుతానికి నిహారికను ఇంటికి పంపించినా, తదుపరి దర్యాప్తులోనైనా పోలీసులు, ఆమె కుటుంబ సభ్యులను విచారించే అవకాశం ఉంటుంది. దాంట్లో వరుణ్ తేజ్ కూడా ఉంటాడు కాబట్టి, ఇప్పుడు అందరూ ఏం జరుగుతుందోనని టెన్షన్‌గా ఉన్నారు. ఇక గని సినిమా విడుదల నేపథ్యంలో ప్రమోషన్స్‌లో పాల్గొనడం, ఇంటర్వ్యూలు ఇవ్వడం తప్పని సరి. కాబట్టి ప్రమోషన్స్ కూడా ఈ కేసు అడ్డొస్తుందేమోనని వరుణ్ అనుకుంటున్నాడట.