మెగా బ్రదర్ నాగబాబు ముద్దుల కూతురు నిహారికకు కళ్యాణ ఘడియలు దగ్గర పడ్డాయి. డిసెంబర్ 9న రాజస్తాన్‌లోని ఉదయ్ పూర్ ప్యాలెస్ వేదికగా చైతన్యని వివాహం చేసుకోనుంది. అంగరంగ వైభవంగా జరగనున్న ఈ పెళ్లి వేడుకకు మెగా ఫ్యామిలీ అంతా హాజరు కానుండడంతో ఆ ప్రాంగణం సందడిగా మారనుంది. ఇక వారు చేసే కోలాహలంతో పెళ్లి వేదిక శోభాయమానంగా మారడం ఖాయం. గత మూడు రోజులుగా నిహారిక ప్రీ వెడ్డింగ్ వేడుకకి సంబంధించిన ఫొటోలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.ఆ ఫొటోలని చూసి మెగా ఫ్యాన్స్ మురిసిపోతున్నారు
మెగా ఫ్యామిలీ వేడుకకి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాని షేక్ చేస్తుండగా, తాజాగా నిహారిక తన ఇన్‌స్టాగ్రామ్‌లో మరో మూడు ఫొటోలని షేర్ చేసింది. ఇందులో ఓ ఫొటోలో లెహంగాతో కనిపించగా, మరో ఫొటోలో సారీతో దర్శనమిచ్చింది. అయితే నిహారిక షేర్ చేసిన ఓ ఫోటోలో ఇద్దరు మహిళలు ఆమె కాళ్లపై పడ్డట్టుగా ఉండటంతో అభిమానులు అవాక్కవుతారని ముందుగానే ఊహించిన నిహారిక దానిపై క్లారిటీ ఇచ్చింది. వారిద్దరు నా హీల్స్ సరి చేస్తున్నారు. వాళ్ళిద్దరు నాకు సహాయకురాలిగా లేకపోతే చాలా ఇబ్బందిగా ఉండేది. లవ్ యూ గార్ల్స్ అంటూ క్యాప్షన్‌గా ఇచ్చింది
ఇక నిహారిక పెళ్లి వేడుకకి మెగా హీరోలందరు హాజరు కానున్నారు. అందరు రెండు రోజుల ముందుగానే ఉదయ్ పూర్ ప్యాలెస్‌కు చేరుకుంటారని తెలుస్తుండగా, మెహందీ, సంగీత్ వేడుకలలో వారు చేసే రచ్చ ఓ రేంజ్‌లో ఉంటుందని అర్ధమవుతుంది. ఎంగేజ్మెంట్‌కు డుమ్మా కొట్టిన పవన్ కళ్యాణ్ పెళ్లికి రెండు రోజుల ముందే వస్తారట. తన అన్న కూతురు పెళ్లికి సంబంధించిన పనులని దగ్గరుండి చూసుకోనున్నాడట.