చెల్లి పెళ్లికి అక్కల సందడి.. మెగా ఇంట్లో సంబురాలు!!

Niharika Konidela Marriage Party With Cousin Sister

మెగా ఇంట్లో పెళ్లి సందడి మొదలుకానుంది. మెగా డాటర్ నిహారిక కొణిదెల చైతన్యల వివాహానికి రోజులు దగ్గరపడుతున్నాయి. ఇప్పటికే వేదికను అందంగా ముస్తాబు చేసినట్టు తెలుస్తోంది. రాజస్థాన్‌లోని ఉదయ్ పూర్‌లోని కోటను అద్భుతంగా అలకరించారట. దేశంలోనే అత్యధిక ఖరీదైన వేదికలో అది కూడా ఒకటని తెలుస్తోంది. మొత్తానికి మెగా ట్యాగ్ రేంజ్‌కు తగ్గట్టే నిహారిక పెళ్లి పనులు జరుగుతున్నాయని సమాచారం. ఇదిలా ఉండగా మెగా ఇంట్లో సంబురాలు ఆల్రెడీ మొదలైనట్టు కనిపిస్తోంది.

Niharika Konidela Marriage Party With Cousin Sister
Niharika Konidela Marriage Party With Cousin Sister

డిసెంబర్ 9న నిహారిక వివాహానికి ముహూర్తం ఖరారు చేసిన సంగతి తెలిసిందే. అంతలోపే అందరికీ గ్రాండ్‌గా బ్యాచిలరెట్ పార్టీని ఇవ్వాలని ఫిక్స్ అయినట్టుంది నిహారిక. అందుకే ఆ మధ్య ఫ్రెండ్స్ అందరూ కలిసి నిహారికను గోవాకు తీసుకెళ్లారు. సర్ ప్రైజ్ ఇచ్చారు. అక్కడ నిహారిక తన స్నేహితులతో కలిసి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఇక చైతన్యతో నిహారిక చెట్టాపట్టాలేసుకుని ఎలా తిరుగుతుందో అందరికీ తెలిసిందే.

అయితే ఫ్రెండ్స్‌కు పార్టీ ఇచ్చింది కానీ ఇంట్లో ఉన్న వాళ్లకు ఇంకా పార్టీ ఇవ్వనలేదు నిహారిక. అసలే అక్కలు బోలెడంత మంది ఉన్నారు. చెల్లి పెళ్లి అంటే అక్కల హవా ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. అయితే నిన్న రాత్రి మెగా డాటర్స్ అందరూ కలిసి రచ్చ రచ్చ చేసినట్టు కనిపిస్తోంది. ఇందులో చిరు పెద్ద కూతురు సుష్మిత, చిన్న కూతురు శ్రీజలు కూడా ఉన్నారు. చెల్లి పెళ్లి అంటూ క్యాప్షన్ పెట్టి నిహారిక షేర్ చేసిన ఫోటో తెగ వైరల్ అవుతోంది.