మెగా డాటర్ నిహారిక సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. ప్రతీ విషయాన్ని సోషల్ మీడియాలో తన ఫాలోవర్లతో పంచుకుంటూ ఉంటుంది. అయితే తాజాగా నిహారిక ఓ పోస్ట్ చేసింది. అందులో ఓ పాటను రిపీట్ మోడ్‌లో వింటున్నట్టు కనిపిస్తోంది. ఆ పాట నిహారికకు తెగ నచ్చేసినట్టుంది. అయితే అందులో ఉన్న పాట, ఆ లిరిక్స్ చూస్తుంటే తన భర్తను ఊహించికున్నట్టు కనిపిస్తోంది.
క్రాక్ సినిమాలో తమన్ కొట్టిన మెలోడి గీతం అందరినీ ఆకట్టుకున్న విషయం తెలిసిందే. కోరమీసం పోలీసోడా అంటూ వదిలిన మెలొడి సాంగ్, దాన్ని విజువలైజ్ చేసిన తీరుకు అందరూ ఫిదా అయ్యారు. పాట ఎంత రొమాంటిక్‌గా ఉంటుందో.. అంతే రొమాంటిక్‌గా తెరకెక్కించారు కూడా. అయితే ఈ పాట నిహారిక మనసు దోచినట్టు కనిపిస్తోంది. అయితే ఈ కోరమీసం అనే సంగతి వరకు వస్తే.. చైతన్యకు కూడా అలానే ఉంటుంది.
నిహారిక భర్త చైతన్య కూడా కోరమీసంతో కనిపిస్తుంటాడు. అలా తన భర్తపై ఉన్న ప్రేమను ఇలా పాట రూపంలో చెబుతూ ఊహించుకుంటుందో ఏమో అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.ఇప్పుడు నిహారిక ఓ వెబ్ సిరీస్ షూటింగ్‌లో బిజీగా ఉంది. ఇందులో అనసూయ కూడా ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఈ మధ్యే ఈ వెబ్ సిరీస్ షూటింగ్ ప్రారంభించినట్టు, చాలా రోజుల తరువాత సెట్‌లో అడుగుపెట్టినట్టు నిహారిక చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే.