కొన్ని సినిమాల్లో హీరోయిన్ల క్యారెక్టరైజేషన్‌ను దర్శకులు వెరైటీగా చిత్రీకరిస్తారు. వర్షం పడుతుంటే ఐస్ క్రీం తినడం, అర్దరాత్రి పూట చలికాలంలో ఐస్ క్రీంలు తినడం వంటి ఫాంటసీలతో హీరోయిన్లకు స్పెషల్ సీన్లను కూడా రాస్తుంటారు. అవి బాగా క్లిక్ అవుతుంటాయి కూడా. ఇప్పుడు నిహారిక కూడా అదే స్టైల్‌ను ఫాలో అయింది. తన భర్తతో కలిసి అర్దరాత్రి బయటకు వెళ్లి మరీ ఐస్ క్రీమ్ కొనుక్కున్నట్టుంది.
నిహారిక చైతన్యలు ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తున్నారు. మాట ముచ్చట్లు అయినప్పటి నుంచే నిహారికచైతన్యలు సోషల్ మీడియాలో సందడి చేయడం ప్రారంభించేశారు. ఇక నిశ్చితార్థం నాడు నిహారిక చైతన్యల సందడి అంతా ఇంతా కాదు. పెళ్లి వేడుకల గురించి అయితే నేషనల్ మీడియా సైతం లైవ్ కవరేజ్ ఇవ్వాల్సినంత డిమాండ్ వచ్చేసింది. మొత్తానికి వీరి పెళ్లి ఘనంగా జరిగింది.
హనీమూన్ కూడా మాల్దీవుల్లో గట్టిగానే ప్లాన్ చేశారు. మొత్తానికి నిహారిక మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తోంది. ఏది అడిగితే అది కొని పెట్టే భర్త దొరకడంతో నిహారిక గాల్లో తేలిపోతోన్నట్టుంది. పైగా నిహారిక కోసం స్పెషల్ పెట్‌ను గిఫ్ట్‌గా ఇచ్చాడు. బజ్ అంటూ నామకరణం చేసి దానికంటూ స్పెషల్ ఇన్ స్టా పేజీని క్రియేట్ చేశారు. అయితే నిన్నఅర్దరాత్రి తన భర్తను బయటకు తీసుకెళ్లి ఐస్ క్రీం కొనిపించుకుంది. అలా ఐస్ క్రీం కొనిచ్చినందుకు నిహారిక స్వీట్‌గా థ్యాంక్యూ చెప్పేసింది.