నిహారికకు పెళ్లి కుదరక పోతే ఈ పాటికి ఓ సినిమాతో బిజీగా ఉండేది. కోలీవుడ్‌లో ఓ మై కడువలే అనే చిత్రంతో సెన్సేషన్ క్రియేట్ చేశాడు అశోక్ సెల్వన్. అతనితో కలిసి నిహారిక ఓ తమిళ చేయాల్సింది. అన్నీ ఫిక్స్ అయ్యాయి. ఆ టీంతో చాలా సార్లు స్టోరీ సిట్టింగ్స్‌లో కూర్చుకుంది. ఆ మూవీకి లేడీ డెబ్యూ డైరెక్టర్ స్వాతిని ఇండస్ట్రీకి పరిచయం అవ్వబోతోంది. ఈ టీంతో నిహారికకు మంచి అనుబంధం ఏర్పడింది.
మరీ ముఖ్యం దర్శకురాలు స్వాతినితో నిహారిక మంచి బంధం ఏర్పడింది. అయితే నిహారికకు పెళ్లి ఫిక్స్ కావడంతో సినిమాలోంచి తప్పుకుంది. నిహారిక పాత్రలో మేఘా ఆకాష్ నటించబోతోంది. అయితే ఆ సినిమాలో హీరోగా నటించబోతోన్న అశోక్ సెల్వన్‌పై నిహారిక చేసిన కామెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయి. నిన్న (నవంబర్ 8) అశోక్ సెల్వన్ బర్త్ డే. ఈ సందర్భంగా నిహారిక విషెస్ తెలిపింది.
ఈ మేరకు అశోక్ సెల్వన్‌తో దిగిన ఫోటోను నిహారిక షేర్ చేసింది. అందులో ఆ ఇద్దరూ ఎంతో సన్నిహితంగా కనిపిస్తున్నారు. ఆ ఫోటో కంటే నిహారిక చేసిన కామెంట్ ఇంకా వైరల్ అవుతోంది. హ్యాపీ బర్త్ డే షో. నువ్ చేసే ప్రతీ పనిలో మంచి జరగాలి.. చూశావా మనం మళ్లి కలిశాం..నువ్ నాతో మరోసారి బెట్‌లో ఓడిపోయావ్ అంటూ చిలిపిగా కామెంట్ చేసింది. మొత్తానికి సినిమా తీయకపోయినా స్నేహ బంధం మాత్రం బలపడింది.