మెగా డాటర్ నిహారికకు చైతన్య జొన్నలగడ్డకు నిశ్చితార్థం అయిన సంగతి తెలిసిందే. మామూలుగా నిశ్చితార్థం కాకముందే.. అంటే మాట ముచ్చట అయినప్పటి నుంచే వీరిద్దరు రచ్చ రచ్చ చేశారు. సంబంధాలు కలిశాక.. అంతా ఓకే అనుకున్నా నిహారిక తనకు కాబోయే భర్త అంటూ చైతన్యను అందరికీ పరిచయం చేసింది. ఆపై ఇద్దరూ కూడా చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. రెస్టారెంట్‌లకు కూడా వెళ్లారు.
ఆగస్ట్‌లో వీరి నిశ్చితార్థం అత్యంత గ్రాండ్‌గా నిర్వహించారు. కోవిడ్ నిబంధనలను పాటిస్తూనే పార్క్ హయత్ హోటల్‌లో అంగరంగ వైభవంగా జరిపారు. ఆ ఈవెంట్‌లో వీరిద్దరి ఫోటోలు ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. అయితే పెళ్లి మాత్రం వచ్చే ఏడాది జరగనున్నట్టు తెలుస్తోంది. ఈ లోపే ఈ ఇద్దరూ మాత్రం మరింత దగ్గరైనట్టు తెలుస్తోంది. ఇప్పటి నుంచి ఈ ఇద్దరూ ఒకరిని విడిచి మరొకరు ఉండలేకపోతున్నారేమో.
ఈ ఇద్దరు కలిసి ప్రస్తుతం జిమ్‌లోనే కష్టపడుతున్నారు. సోల్ మేట్స్ కాస్త జిమ్ మేట్స్ అయ్యారు. ఇద్దరూ కలిసే వస్తున్నారు.. కలిసే చేస్తున్నారు.. కలిసే వెళ్తున్నారట. ప్రేమ పక్షుల్లా వీరిద్దరి మధ్య అనుబంధం ఇలా గట్టిపడుతోంది. తాజాగా నిహారిక ఓ ఫోటోను షేర్ చేసింది. అందులో ఈ ఇద్దరి కాళ్లు ఉన్నాయి. అయితే నిహారిక షేర్ చేసిన ఫోటోకు చైతన్య కామెంట్ పెట్టాడు. జిమ్ బడ్డీస్ అంటూ తమ మధ్య ఉన్న ప్రేమను చాటాడు.