Niharika: నిహారిక ఇటీవల ఓ మలయాళీ సినిమాకి సంబంధించిన ఒక వీడియో సాంగ్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ పాటలో నిహారిక కాస్త హాట్ ఎక్స్పోజింగ్ ఇవ్వడమే కాకుండా రొమాన్స్ చేస్తూ కనిపించారు. ఇలా రొమాంటిక్ గా పెద్ద ఎత్తున గ్లామర్ షో చేస్తూ ఈ పాటలో నటించడం పట్ల ఈమెపై మెగా అభిమానులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిహారికను హీరోయిన్గా మెగా అభిమానులు సక్సెస్ చేయకపోవడానికి కారణం ఆమె మెగా ఆడపడుచు కావడమేనని చెప్పాలి.
ఇప్పటివరకు మెగా ఇంట్లో నుంచి ఎంతోమంది హీరోలు వచ్చారు వారందరికీ అభిమానుల మద్దతు లభించింది కానీ ఇలా మెగా డాటర్ సినిమాలలో నటించడం ఏమాత్రం ఇష్టపడని అభిమానులు ఆమె సినిమాలను పెద్దగా సక్సెస్ చేయలేకపోయారు. అయితే ఈమె పెళ్లి చేసుకొని అత్తారింటికి వెళ్లారు అయితే అక్కడికి కూడా ఇమడలేక నిహారిక తన భర్తకు విడాకులు ఇచ్చి తిరిగి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.
ఈ విధంగా నిహారిక ఇండస్ట్రీలో నిర్మాతగా కొనసాగుతూ మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా నిర్మాతగా మెగా డాటర్ సక్సెస్ కావడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు కానీ ఈమె హీరోయిన్గా ఇలా రొమాంటిక్ సాంగ్స్ చేస్తూ భారీగా ఎక్స్పోజ్ చేయడం మెగా అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే ఈమె పట్ల తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపిస్తున్నారు.
నిహారిక మీరు ఇలాంటి పాటలు లేదా సన్నివేశాలలో నటించేటప్పుడు ఒక్కసారిగా మీ కుటుంబ నేపథ్యం గురించి ఆలోచించండి. మీ తండ్రి గారికి ఎంతో మంచి రాజకీయ నేపథ్యముంది మీ పెదనాన్నకు ఎంతో గౌరవ ప్రతిష్టలు ఉన్నాయి. ఇక మీ బాబాయ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు. ఈ విషయాలన్నింటిని గుర్తు పెట్టుకొని మీరు సినిమాలలో నటించండి అంటూ మెగా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.