మెగా డాటర్ నిహారిక పెళ్లి డిసెంబర్ 9న జరిగిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 9న ఉదయ్ పూర్‌లోని ఉదయ్ విలాస్ ప్యాలెస్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. గత నెల ఈ సమయానికి అంతా హడావిడిగా ఉంది. మెగా హీరోలు రచ్చ చేయడంతో సోషల్ మీడియా మొత్తం షేక్ అయిపోయింది. ఇక పెళ్లి తరువాత ఈ నెల రోజుల పాటు రకరకాలుగా ఎంజాయ్ చేశారు. గుళ్లుగోపురాలంటూ పెళ్లి అనంతరం తిరిగారు.
ఆ తరువాత క్రిస్మస్ పార్టీ అంటూ మెగా ఇంట్లో రచ్చ చేశారు. నిహారిక బర్త్ డే సందర్భంగానూ బాగానే ఎంజాయ్ చేశారు. చైతన్య కూడా స్పెషల్ గిఫ్ట్ ఇచ్చి ఆశ్చర్యపరిచాడు. ఇక మాల్దీవుల్లో హనీమూన్‌ను సెలెబ్రేట్ చేసుకున్నారు. మొత్తానికి ఈ నెల రోజుల పాటు విపరీతంగా ఎంజాయ్ చేశారు. మరీ ముఖ్యంగా నిహారిక మాత్రం బాగానే బెట్టుచేస్తోన్నట్టుంది. అర్దరాత్రి పూట చలికాలంలో ఐస్ క్రీం తినాలని చైతన్యను పట్టుబట్టి మరీ తీసుకెళ్లినట్టుంది.
ఇక పెళ్లి అయి నెల అవుతున్న సందర్భంగా ఈ జంట బాగానే ఎంజాయ్ చేసింది. ఈ సందర్భాన్ని గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసుకుంది. జంపింగ్‌లు చేస్తూ చిన్న పిల్లల్లా మారిపోయి ఆటలు ఆడుతూ సెలెబ్రేషన్స్ చేసుకున్నారు. మొత్తానికి ఈ వీడియోను చూస్తే నవ్వుకోవాల్సిందే. నిహారిక అల్లరి, చైతన్య తప్పించుకుంటూ తొండిగా ఆడటం, నిహారిక వారించడం అన్నీ కూడా వీడియోలో కనిపిస్తున్నాయి. మొత్తానికి ఈ కొత్త జంట మాత్రం ఇలా నెల అయిన సందర్భంగా రచ్చ రచ్చ చేసింది.