Tamasha with Harsha: నిహారికకు ఇండస్ట్రీలో ఉన్న టాగ్ ఏంటో తెలుసా? వైవా హర్ష పెట్టాడు..!

niharika and navdeep in Tamasha With Harsha show

ఆహా.. ఓటీటీ ప్లాట్ ఫాం గురించి తెలుసు కదా మీకు. ఆహా.. తెలుగు ఓటీటీల్లో ప్రస్తుతం టాప్ లో ఉంది. వెబ్ సిరీస్ లు, సినిమాలతో పాటు టాక్ షోలను కూడా నిర్వహిస్తోంది ఆహా.

niharika and navdeep in Tamasha With Harsha show
niharika and navdeep in Tamasha With Harsha show

తాజాగా.. వైవా హర్షతో తమాషా విత్ హర్ష అనే టాక్ షోను ప్రారంభించారు. మొదటి ఎపిసోడ్ లోనే నిహారిక, నవదీప్ ను ఇన్వైట్ చేశారు. ఈ షోకు వీళ్లిద్దరినే ఎందుకు పిలిచారు. అది కూడా మొదటి ఎపిసోడ్ కే.. అనే విషయాన్ని హర్షనే వాళ్లకు చెప్పాడు.

నిహారికకు పెళ్లయ్యాక కూడా తను ఇండస్ట్రీలో కొనసాగితే.. తనకు ఓ టాగ్ తగిలిస్తారట. సినిమా హీరోలకు స్టార్లు ఉంటాయి కదా.. మెగాస్టార్, పవన్ స్టార్, రెబల్ స్టార్ అని.. ఒకవేళ నిహారిక ఇండస్ట్రీలో కొనసాగితే తనకు ఏ స్టార్ ఇస్తారో కూడా ముందే చెప్పేశాడు హర్ష.

మెగా పవర్ స్టయిలిష్ ప్రిన్స్ ఏంజెల్ అక్క అట. ఇదే టాగ్ ను తనకు ఇచ్చారట. వామ్మో.. ఎంత పొడుగు ఉంది టాగ్ కదా. మెగా ఫ్యామిలీలో ఉన్న స్టార్ల పేర్లన్నింటినీ కలిపి మరీ పెట్టినట్టున్నారు ఈ పేరు.

ఇక నవదీప్ కేమో సింగిల్ స్టార్ అని పెట్టారట. మొత్తానికి వైవా హర్ష.. నిహారిక, నవదీప్ తో కలిసి ఈ షోలో రచ్చ రచ్చ చేశాడు. దానికి సంబందించిన మొదటి ఎపిసోడ్ ను తాజాగా యూట్యూబ్ లో విడుదల చేశారు. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా తమాషా విత్ హర్ష మొదటి ఎపిసోడ్ పై ఓ లుక్కేసుకోండి..

https://www.youtube.com/watch?v=HJL7TC8SOJU