పెళ్లి కాకముందే అలా తిరిగేస్తున్నారా?.. నిహారిక ఫోటోలు వైరల్

Niharika And Chaitanya Latest pics

మెగా డాటర్ నిహారిక పెళ్లి అంటే మామూలు విషయం కాదు. అసలే నిహారికకు సోషల్ మీడియా, యూట్యూబ్‌ వాళ్లు ఎన్నో సంబంధాలు చూసేసి తమ తమ వార్తల్లో పెళ్లిళ్లు కూడా చేశారు. ఏకంగా ప్రభాస్‌తో పెళ్లి అని కూడా వార్తలు రాసేశారు. అలా నిహారిక పెళ్లిని సోషల్ మీడియా తన నెత్తిన వేసుకుంది. అయితే ఈ కష్టాన్ని తగ్గించేందుకు మెగా ఫ్యామిలీ నిహారికకు ఓ హీరోలాంటి వరుడ్ని వెతికిపట్టుకుంది.

Niharika And Chaitanya Latest pics
Niharika And Chaitanya Latest pics

ఆగస్టులో వారిద్దరికి నిశ్చితార్థం కూడా జరిగింది. అయితే అంతకు ముందే నిహారిక తనకు కాబోయే భర్త వివరాలను ప్రకటించింది. అతని పేరు చైతన్య జొన్నలగడ్డ అని చెబుతూ ఫోటోలను కూడా షేర్ చేసింది. ఇక వీరిద్దిరూ అప్పటి నంచి జంట పక్షుల్లా బాగానే విహరిస్తున్నారు. ఇక చైతన్య బర్త్ డే సందర్భంగా నిహారిక స్పెషల్ ట్రీట్ కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. ఓ రెస్టారెంట్‌లో వారు దిగిన ఫోటోలు ఓ రేంజ్‌లో వైరల్ అయ్యాయి.

Niharika And Chaitanya Latest pics
Niharika And Chaitanya Latest pics

హైదరాబాద్‌లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసే చైతన్యకు నిహారికతో పెళ్లి ఫిక్స్ అయ్యాక భారీగానే ఫాలోయింగ్ పెరిగింది. నిశ్చితార్థం రోజు వీరి ఫోటోలు ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. తాజాగా వీరిద్దరు మళ్లీ కలిసినట్టు తెలుస్తోంది. మొత్తానికి ఈ కొత్త జంట మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తోంది. పెళ్లాయ్యాక నిహారిక సినిమాలకు పూర్తిగా దూరం కానున్న సంగతి తెలిసిందే. ఇక నిహారిక ప్రస్తుతం వర్కౌట్లు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది.