మెగా డాటర్ నిహారిక పెళ్లికి ముహూర్తం దగ్గరపడుతోంది. డిసెంబర్ 9న రాజస్థాన్‌లోని ఉదయ్ పూర్‌లో వివాహం జరగబోతోందని అందరికీ తెలిసిందే. అయితే మూడు ముళ్లు పడకముందే నిహారిక చైతన్యలు ఎంత రచ్చ చేస్తున్నారో అందరికీ తెలిసిందే. ప్రైవేట్ పార్టీలు, రెస్టారెంట్లు, పెళ్లిళ్లకు తిరుగుతూ నానా హంగామా చేస్తున్నారు. వీరి క్యూట్ ఫోటోలను చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. అంతే కాకుండా ఈ ఇద్దరూ కలిసి జిమ్‌లో తెగ కష్టపడుతున్నారు.
దీపావళి వేడుకలోనూ ఈ ఇద్దరూ హైలెట్ అయ్యారు. పెళ్లి కాకుండానే కాబోయే అల్లుడు నాగబాబు ఇంట్లో సందడి చేశాడు. దీపావళి సెలెబ్రేషన్స్‌లో వరుణ్ తేజ్ నిహారిక చైతన్యలు దిగిన ఫోటోలు ఓ రేంజ్‌లో వైరల్ అవుతున్నాయి. అయితే తాజాగా ఈ జంట రాజస్థాన్‌లోని ఉదయ్ పూర్‌లో వాలింది. ఇలా దీపావళిని సెలెబ్రేట్ చేసుకున్నారో లేదో.. అలా ప్లాన్ వేసేశారు. ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ గురించి అందరికీ తెలిసిందే. ప్రీ వెడ్డింగ్ షూట్ అనేది లేకపోతే అది అసలు పెళ్లిలానే ఉండదనే ఫీలింగ్ వచ్చేసింది.
అలా ఆ ప్రీ వెడ్డింగ్ షూటింగ్ కోసమే ప్రస్తుతం ఈ జంట ఉదయ్ పూర్‌కు వెళ్లినట్టు తెలుస్తోంది. ఉదయ్ పూర్‌లో పెళ్లి వేదిక దగ్గర ఫోటో షూట్ చేయబోతోన్నట్టు తెలుస్తోంది. రాజ మహల్ లాంటి భారీ కోటలో ఈ స్పెషల్ ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ ఉండబోతోంది. ఈమేరకు నిహారిక ఈ ఉదయమే అక్కడ ల్యాండ్ అయినట్టుంది. తాజాగా నిహారిక షేర్ చేసిన ఫోటోను చూస్తే అది తెలుస్తోంది. ఆ ఫోటోలో నిహారిక నవ్వులకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇక ఈ ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ ఎలా ఉంటుందో చూడాలి.