Nidhi Agarwal : 2025 లక్కీ ఇయర్‌ : నిధి అగర్వాల్‌

వచ్చే ఏడాది ఆడియన్స్‌కి డబుల్‌ ట్రీట్‌ ఇవ్వనున్నది అందాలభామ నిధి అగర్వాల్‌. ఒకే ఏడాది ఇద్దరు సూపర్‌స్టార్లతో రెండు పానిండియా సినిమాల్లో ఆమె మెరవనున్నది. అందులో ఓ సినిమా పవన్‌కల్యాణ్‌ ‘హరిహర వీరమల్లు’ కాగా, రెండో సినిమా ప్రభాస్‌ ‘రాజా సాబ్‌’. ఈ సందర్భంగా ఆమె ఆనందాన్ని వ్యక్తం చేస్తూ.. ‘పవన్‌ సార్‌తో ‘హరిహర వీరమల్లు’లో నటించడం చాలా ఆనందంగా ఉంది.

అసలు ఆయనతో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడం గర్వకారణం కూడా. ఇక ‘రాజా సాబ్‌’లో ప్రభాస్‌ సార్‌తో కలిసి నటించడం మరిపోలేని అనుభూతి. సినిమాకోసం టీమ్‌ మొత్తం డెడికేటెడ్‌గా పనిచేస్తున్నారు. ఈ రెండు పాన్‌ఇండియా సినిమాలూ 2025లోనే విడుదల కానున్నాయి. అందుకే 2025 నా లక్కీ ఇయర్‌. వీటితో పాటు వచ్చే ఏడాది తెలుగు, తమిళంలో మరికొన్ని సర్‌ప్రైజింగ్‌ మూవీస్‌లో నటిస్తున్నాను. వాటి గురించి త్వరలో తెలియజేస్తా.’ అన్నారు నిధి అగర్వాల్‌.