ఎలా గోల చేశారో చూడండి.. నిధి అగర్వాల్ క్రేజ్‌కు ఇదే నిదర్శనం

Nidhhi Agerwal surrounded by fans in rajahmundry shooting

మామూలుగా సినీ తారలు బయట కనిపిస్తే జనాలు అంత ఈజీగా వదులరు. మామూలు రేంజ్ ఉన్న వాళ్లు కనిపిస్తే రచ్చ రచ్చ చేస్తుంటారు. అలాంటి స్టార్ హీరోయిన్, మంచి ఫాంలో ఉన్న బ్యూటీ కనిపిస్తే జనాలు ఊరుకుంటారా. తాజాగా అదే జరిగింది నిధి అగర్వాల్‌ను అభిమానులు ఉక్కిరిబిక్కిరి చేసేశారు. రాజమండ్రిలో జరుగుతున్న షూటింగ్ స్పాట్‌కు నిధి అభిమానులు కుప్పలు తెప్పలుగా వచ్చారు. ఒక్కసారిగా నిధిని చుట్టు ముట్టేశారు.

Nidhhi Agerwal surrounded by fans in rajahmundry shooting
Nidhhi Agerwal surrounded by fans in rajahmundry shooting

నిధి అగర్వాల్ ప్రస్తుతం రాజమండ్రిలో అశోక్ గల్లా సినిమా షూటింగ్‌లో బిజీగా ఉంది. అక్కడ షూటింగ్ జరుగుతోందని తెలుసుకున్న నిధి అభిమానులు ఆమె కోసం పడిగాపులు కాశారు. ఇక నిధి బయటకు వస్తుంటే అభిమానులు ఈలలు, గోలలు మామూలుగా లేవు. వాటిని నిధి బాగానే ఎంజాయ్ చేస్తు ముందుకు కదిలింది. కానీ జనాలు మాత్రం సెల్ఫీలు అంటూ నిధికి ఊపిరి ఆడకుండా చేశారు. చుట్టుపక్కలా బాడీ గార్డ్స్ ఉన్నారు కాబట్టి నిధి తప్పించుకుంది.

లేదంటే నిధిని ఎవ్వరూ వదిలిపెట్టేవారు కాదు. అంత బాడీ గార్డులున్నా కూడా నిధి సెల్ఫీ కోసం వెంటపడుతూనే ఉన్నారు. అలా ఓ అభిమాని నిధి ముందే కింద పడిపోయాడు. అలా అభిమాని అలా కిందపడి పోవడంతో అయ్యో అంటూ నిధి బాధపడింది. అతన్ని అందరూ లేపి పక్కకు తీసుకెళ్లిపోవడంతో నిధి ముందుకు సాగింది. ఇస్మార్ట్ అందాలను వల వేసి సాధించికున్న ఫాలోయింగ్ ఇది. నిధి క్రేజ్ ఎలా ఉందో చెప్పడానికి ఇదో ఉదాహరణ మాత్రమే.