“గుంటూరు కారం” నుంచి మరో బ్లాస్ట్ అప్పుడు అంటున్న నిర్మాత.!

Naga-Vamsi

టాలీవుడ్ సినిమా దగ్గర ఉన్న కొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ లలో ఐతే సూపర్ స్టార్ మహేష్ బాబు అలాగే దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ కూడా ఒకటి. మరి ఈ ఇద్దరు నుంచి ఇప్పటివరకు అతడు, ఖలేజా అనే రెండు సెన్సేషనల్ క్లాసిక్ చిత్రాలు రావడం నెక్స్ట్ ఎన్నో ఏళ్ళు తర్వాత హ్యాట్రిక్ సినిమా అనౌన్స్ కావడంతో హైప్ ఆకాశాన్ని అంటింది.

దీనితో ఆ హైప్ ని టచ్ చేసేందుకు ఏదేదో ప్లాన్ చేస్తూ వచ్చారు కానీ ఫైనల్ ఆ ఈ చిత్రం “గుంటూరు కారం” దగ్గరకి వచ్చింది. అయితే నిన్న సూపర్ స్టార్ కృష్ణ గారి జయంతి సందర్భంగా అయితే సినిమా టైటిల్ ని సహా మహేష్ నుంచి మాస్ ఏక్షన్ వీడియో ని రిలీజ్ చేయగా మరి నెక్స్ట్ బిగ్ అప్డేట్ అయితే మహేష్ బర్త్ డే కి ఉంటుంది అని యంగ్ నిర్మాత నాగవంశీ కన్ఫర్మ్ చేశారు.

మహేష్ మాస్ స్ట్రైక్ కి ఇచ్చిన రెస్పాన్స్ తో అయితే నెక్స్ట్ ఈ ఆగష్టు 9న మహేష్ బాబు బర్త్ డే కానుకగా వచ్చే నెక్స్ట్ అప్డేట్ ఇంకో లెవెల్లో ఉంటుంది లేటెస్ట్ అప్డేట్ ఇచ్చేసారు. దీనితో గుంటూరు కారం నుంచి అసలు ట్రీట్ అప్పుడు ఉంటుంది అని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాకి పూజా హెగ్డే, యంగ్ సెన్సేషన్ శ్రీ లీల లు హీరోయిన్స్ గా నటిస్తుండగా థమన్ సంగీతం ఇస్తున్నాడు. అలాగే హారికా హాసిని వారు వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ చేయబోతున్నారు.