ఒకటి కంటే ఇంకో సినిమా టిక్కెట్ ఫ్రీ అట.! ‘వినరో భాగ్యము విష్ణు కథ’ సినిమా విషయంలో సరికొత్త స్ట్రేటజీ తెరపైకి తెచ్చింది చిత్ర బృందం. ‘నైబర్ నంబర్ కాన్సెప్ట్’తో సినిమా తెరకెక్కింది కదా.! ఆ కోణంలోనే వన్ ప్లస్ వన్ ఆఫర్ అనుకునేరు.! నిజానికి, అది నిజం కాదు. ఇదొక వ్యూహాత్మక ప్రయోగమట. ఇకపై పెద్ద సినిమాలకు కూడా ఇలాంటి వ్యూహాల్ని అమలు చేసే అవకాశం వుందట.
ఇంకోపక్క, ‘మైఖేల్’ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ విషయంలోనూ ఇంకో కొత్త స్ట్రేటజీ తెరపైకి తెచ్చారు. దాదాపు 2 వేల సబ్‌స్క్రిప్షన్స్ (క్వార్టర్లీ) ఉచితంగా ఇస్తున్నారట.
అదిరింది కదూ.! థియేటర్లకు జనాన్ని రప్పించడమే కాదు, ఓటీటికి జనాల్ని రప్పించడం కూడా కనాకష్టమైపోయిందన్నమాట. థియేటర్లనీ చెడగొట్టేసి, ఓటీటీనీ చెడగొట్టేసి.. వాట్ నెక్స్‌ట్.? ఆ ఒక్కటీ అడక్కూడదంతే.
కోవిడ్ తర్వాత సినిమా పరిస్థితులు మారాయా.? కోవిడ్ కంటే ముందే దారుణంగా తయారయ్యాయా.? కొన్ని సినిమాలు ఆడుతున్నాయ్.. కొన్ని సినిమాలు దారుణంగా తేలిపోతున్నాయ్. ఎక్కడ తేడా కొడుతోందో ఎవరికీ అర్థం కావడంలేదాయె.!