RRR: ఎత్తర జెండా అంటూ ప్రేక్షకుల రక్తం మరిగించిన ఎన్టీఆర్ రామ్ చరణ్..!

RRR:రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తీసిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమా మొదటిసారిగా ఎన్టీఆర్ రామ్ చరణ్ కలిసి నటించారు. ఈ సినిమా జనవరికే పూర్తయి విడుదలకు సిద్ధమైన కరోనా కారణంగా వాయిదా పడింది. ఇక ఇపుడు మార్చి 25 న విడుదలకు జోరుగా సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రచారాన్ని జనవరిలో పెద్ద ఎత్తున చేసిన చిత్ర యూనిట్ ఇపుడు అంత ఖర్చు పెట్టకుండా సినిమా విడుదలకు వారం ఉండగా మొదలుపెడుతోంది.బెంగళూరు నగరం లో పెద్ద ఈవెంట్ ప్లాన్ చేసారు రాజమౌళి ఇక ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానులు మరోవైపు హడావిడి మొదలెట్టారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి పాటలను, ట్రైలర్ ను విడుదల చేశారు. తాజాగా సినిమాలో ‘ఎత్తరా జెండా’ అనే పాటను విడుదల చేశారు. నెత్తురు మరిగితే ఎత్తరా జెండా’ అంటూ సాగే ఈ పాటను విశాల్ మిశ్రా, పృథ్వీ చంద్ర, ఎంఎం కీరవాణి, సాహితి చాగంతి, హారిక నారాయణ్ కలిసి పాడారు.ఈ సాంగ్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్, అలియా భట్ ముగ్గురూ కనిపించారు. ఈ పాటలో ముగ్గురు డాన్స్ కు అభిమానులు ఫిదా అయిపోయారు.
YouTube video player

తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమా భారీ ఎత్తున రిలీజ్ చేయనున్నారు. ప్రీ బుకింగ్స్‌లో టికెట్స్‌ను ముందుగానే బ్లాక్ చేసేసుకుంటున్నారు అభిమానులు.మొన్నామధ్య ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఒక థియేటర్స్ మొత్తం టికెట్స్ కొనేసి కెనడాలో ఆశ్చర్య పరిస్తే, కొద్దిరోజులకే మరో చోట కార్స్ తో ఎన్టీఆర్ అని ఆర్ఆర్ఆర్ అని ఆంగ్ల అక్షరాలలో అర్థం వచ్చేలా రాసారు. ఇక ఇపుడు ఏకంగా విమానం నుండి ఎన్టీఆర్ పాత్ర కొమరం భీమ్ చెప్పే ‘తొక్కుకుంటూ పోవాలే ‘ డైలాగు ను ఆకాశంలో వదిలి సందడి చేసారు.సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్ది ఫ్యాన్స్ చేస్తున్న కొన్ని కార్యక్రమాలు మేకర్స్‌ను సైతం ఆశ్చర్యపరుస్తున్నాయి