ఒక్క సినిమా.. ఒకే ఒక్క సినిమా.. ఆమెని రాత్రికి రాత్రి స్టార్‌ని చేసేసిందనడం అతిశయోక్తి కాదేమో.! ‘అప్పుడే పెళ్ళి చేసుకోవద్దు.. చాలా కెరీర్ వుంది..’ అంటూ అల్లు అరవింద్ ఆశీర్వాదంతో కూడిన సూచన చేసేశారు కూడా ఆమెకి.
ఆమె పేరు వైష్ణవి చైతన్య. యూ ట్యూబ్ వీడియోలతో పాపులర్ అయి, ఇప్పుడు హీరోయిన్‌గా మారింది ‘బేబీ’ సినిమాతో. ‘బేబీ’ రిజల్ట్ సంగతెలా వున్నా, టాలీవుడ్‌లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయిపోయింది వైష్ణవి.
యంగ్ హీరోల సరసన హీరోయిన్‌గా ఆమె పేరు ఓ నాలుగైదు సినిమాల్లో కనిపించబోతోందట. ఆల్రెడీ ఆమె కొన్ని సినిమాల్ని సైన్ చేసినట్లు తెలుస్తోంది. కానీ, తెలుగమ్మాయిలు తెలుగు తెరపై నిలదొక్కుకోగలరా.? అదే పెద్ద సమస్య.
ఈషా రెబ్బా, బిందు మాధవి.. చెప్పుకుంటూ పోతే లిస్టు చాలా చాలా పెద్దదే. కానీ, వైష్ణవి అందుకు పూర్తి భిన్నం.. అన్న చర్చ సినీ వర్గాల్లో జరుగుతోంది. నిజమేనా.?