Samantha & Rashmika : సినీ సెలబ్రిటీలకు అభిమానులు ఇంత మంది ఉంటారో వాళ్ళను విమర్శించడానికి అంత మందే ఉంటారు. ఇక ఈ సోషల్ మీడియా జమానాలో సెలబ్రిటీలు ఏమి చేసిన ప్రశంసలు, విమర్శలు కామన్. ఇక సెలబ్రిటీలు కూడా ఏదో ఒకటి మాట్లాడి ట్రోలర్స్ కు చిక్కుతుంటారు. ఈ మధ్య హీరోయిన్ సమంతకు ఈ ట్రోల్స్ బాధ ఎక్కువైంది.
విడాకులు తీసుకున్నప్పటి నుండి సమంత ను సోషల్ మీడియాలో చాలా మంది విమర్శించడం మొదలుపెట్టారు. తాన డ్రెస్సింగ్ విషయంలో సమంతను టార్గెట్ చేస్తుంటారు నెటిజన్స్. అయితే ఈ. మధ్య సమంత నెగెటివ్ కామెంట్స్ ట్రోల్స్ చేసే వాళ్లను ఉద్దెశించి నా మౌనాన్ని చేతగానితనంగా చూడొద్దు అంటూ దయ, మంచితనానికి ఎక్స్ పైరీ డేస్ ఉంటుందంటూ పోస్ట్ పెట్టింది.
Word! 💪🏻
— Rashmika Mandanna (@iamRashmika) April 23, 2022
అయితే ఈ పోస్ట్ కీ నేషనల్ క్రష్ రష్మిక స్పందిస్తూ వర్డ్ పవర్ అంటూ కామెంట్ చేసింది. ఇక ఇపుడు సమంత ను వదిలి రష్మిక ను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు నెటిజన్స్. ఇద్దరు ఇద్దరే ఒకరు పెళ్ళయ్యాక విడాకులిస్తే, ఇంకొకరు నిశ్చితార్థం చేసుకుని అది రద్దు చేసుకుని తిరుగుతోంది అంటూ కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు పెట్టారు. పాపం చైతు, రక్షిత్ శెట్టి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ పోస్ట్ ఇపుడు సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది.సమంత ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉంది యశోద మూవీ విడుదలకు సిద్ధమైంది. ఇక రష్మిక్స్ కూడా బాలీవుడ్ ప్రాజెక్ట్స్, ఇరు టాలీవుడ్ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉంది. ఇక లేటెస్ట్ గా ఈ అమ్మడు ఎన్టీఆర్ కోరటాల సినిమాలో ఛాన్స్ కొట్టేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి