టాలీవుడ్ సహా తమిళ సినిమా దగ్గర కూడా ఒకనాడు సమయంలో ఇండస్ట్రీని ఊపేసిన హీరోయిన్స్ లో నటి రోజా కూడా ఒకరు. మరి రోజా అయితే ఇప్పుడు తెలుగు రాష్ట్రం ఏపీలో రోజా ఎమ్మెల్యేగా మంత్రిగా బిజీగా ఉండగా ఆమె రాజకీయం పరంగా పలు సంచలన వ్యాఖ్యలు అయితే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సహా నటుడు పవన్ కళ్యాణ్ మరియు మెగాస్టార్ చిరంజీవి పై కూడా రోజా పలు కామెంట్స్ చేయడం జరిగింది.
అది కూడా కొన్ని దారుణ పరుశజాలం తోనే ఆమె ఎన్నో కామెంట్స్ చేయడం సంచలనంగా మారింది. దీనితో రోజాపై ఎవరో టీడీపీ నేత పర్సనల్ గా కామెంట్స్ చేసారు అని వాపోయింది రోజా. మరి సరిగ్గా ఇదే సమయంలో ఆమెకి అండగా తన సహచర సీనియర్ నటి తమిళ్ మరియు తెలుగులో ఎన్నో చిత్రాలు చేసిన నటి రాధికా రోజాకి సపోర్ట్ గా మాట్లాడ్డం జరిగింది. దీనితో ఇప్పుడు రాధికపై పెద్ద ఎత్తున విమర్శలు మొదలయ్యాయి.
రాధికకి తన భర్త కి ఆర్ధికంగా చాలా కష్టంలో ఉన్నపుడు ఆదుకున్న మెగాస్టార్ చిరంజీవిని తన కుటుంబాన్ని రోజా అన్ని మాటలు అంటున్నప్పుడు రాధికా అంతా ప్రశ్నిస్తున్నారు. సరే ఇది పక్కన పెడితే వారి తమిళ ఇండస్ట్రీ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అయినటువంటి రజినీకాంత్ ని కూడా వైసీపీ వారు ఎన్నో మాటలు అన్నపుడు ఎందుకు స్పందించలేదు అని ఇప్పుడు రోజా చేసిన పనికే సరైన కౌంటర్ ఇస్తే దానికి రాధికా రెస్పాన్స్ అవ్వడం బాగాలేదని అంటున్నారు.