Vijay-Ajith: ఈ స్టార్ హీరో చనిపోయారంటూ ట్రోలింగ్ చేస్తున్న నెటిజన్స్… ఏమైందసలు?

Vijay-Ajith: కొన్ని సార్లు ఫ్యాన్స్ అభిమానం ఎలా ఉంటుందంటే చూసే వాళ్లకే కాదు, పక్కనున్న వాళ్లకు కూడా చిరాకు తెప్పిస్తుంది. మా హీరో గొప్ప అంటే, మా హీరో గొప్ప అంటూ వారు చేసే రచ్చ చూస్తుంటే ఎవరికైనా కోపం, అసంతృప్తి రాక మానదు. సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచీ ఈ రకమైన గొడవలు మరీ ఎక్కువైనట్టు తెలుస్తోంది. తమ హీరో ఇలా అంటూ కొందరు పోస్టులు పెడితే, అందుకు వ్యతిరేకంగా మరొక హీరోకి సంభందించిన అభిమానులు పోస్టులు పెడుతూ గొడవ పెద్దది చేస్తున్నారు.

ఇక ఇటీవల అలాంటి సంఘటనే ఒకటి ప్రస్తుతం వైరల్ గా మారింది. ఆ హీరో చనిపోయాడంటూ ఒక వర్గం వాళ్ళు ప్రచారం చేస్తే, దానికి ఆన్సర్ గా మరో హీరోకి ఎయిడ్స్ అంటూ ప్రచారం చేస్తూ తమ నీచ బుద్ధిని చాటుకుంటున్నారు.

ఇక వివరాల్లోకి వెళితే, ఇటీవల తమిళ్ హీరో విజయ్ ఫోటోకు దండలు వేసి చనిపోయినట్టున్న ఉన్న ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, RIPJosephVijay అనే హాష్ టాగ్ తో వైరల్ చేస్తున్నారు. ఇక విజయ్ అంటే గిట్టని మరికొందరేమో ఆయన చనిపోయాడు అంటూ మే
మీమ్స్ చేసి ట్రోల్ చేస్తున్నారు. ఇక ఇదంతా హీరో అజిత్ అభిమానుల పనే అని భావించిన విజయ్ ఫ్యాన్స్, హీరో అజిత్ కి ఎయిడ్స్ అని ప్రచారం చేస్తూ, #Aids_Patient_Ajith అనే హాష్ టాగ్ తో ట్విట్టర్ లో హంగామా సృష్టిస్తున్నారు. సినీ పరిశ్రమలో ఆ ఇద్దరు స్టార్ హీరోస్ కి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిందే. కానీ వారి మధ్య ఎలాంటి విబేధాలు లేవన్నది సత్యం. ఐనా కూడా ఈ ఫ్యాన్స్ మాత్రం ఇలా లేని పోని రచ్చ క్రియేట్ చేస్తున్నారు అని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అభిమానం ఉండాలి గానీ, మరీ ఇలా వారి మనోభావాలను దెబ్బ తీసేలా ఉండకూడదని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.