ఒకప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు, టాలీవుడ్ మన్మథుడిగా అందరి హృదయాలని గెలుచుకున్న కింగ్ నాగార్జున అరవై ఏళ్ళ వయస్సులోను అమ్మాయిల గుండెలలో బాణాలు దించే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం కుర్ర హీరోలకు పోటీగా సినిమాలు చేస్తూ మరోవైపు బిగ్ బాస్ షోని హోస్ట్ చేస్తున్నాడు. సీజన్ 3, సీజన్ 4కు నాగార్జుననే హోస్ట్‌గా ఉండగా, ఆయన కంటెస్టెంట్‌ల విషయంలో కనబరిచే వ్యత్యాసంపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ నడుస్తుంది. స్టేజ్‌పై అమ్మాయిలు వచ్చినప్పుడు ఒకలా, అబ్బాయిలు వచ్చినప్పుడు ఇంకోలా ప్రవర్తిస్తున్నాడంటూ ట్రోల్స్ చేస్తున్నారు.
సీజన్ 4లో మొత్తం 19 మంది సభ్యులు పాల్గొనగా, ఇప్పటి వరకు 12 మంది సభ్యులు హౌజ్ నుండి నిష్క్రమించారు. అయితే అమ్మాయిలు స్టేజ్‌పైకి వచ్చినప్పుడు వారితో చనువుగా ఉంటూ నాగార్జున విమర్శలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఆదివారం రోజు లాస్య తో నాగ్ ప్రవర్తనపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ నడుస్తున్నాయి. ఎలిమినేట్ అయిన లాస్య స్టేజ్‌పైకి రాగానే గట్టిగా హగ్ చేసుకున్న నాగ్ ఆమెపై చేయి తీయకుండా ఉండలేకపోయాడు. గడికో సారి ఆమె భుజాలపై చేతులు వేయడం లేదంటే దగ్గరకు లాక్కోవడం వంటివి చేయసాగాడు.
కరోనా పేరుతో అబ్బాయిలని దూరంగా ఉంచిన నాగ్ అమ్మాయిల విషయంలో మాత్రం ఆ కండీషన్స్ అన్ని పక్కన పెట్టేస్తున్నాడు. ఇది ట్రోలర్స్‌కు మంచి స్టఫ్ అందించినట్టు అయింది. దీంతో వారు నాగార్జునని సోషల్ మీడియా వేదికగా ఏకి పారేస్తూ విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. పలు మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. ముసలోడే కాని మహనుభావుడు అని కొందరు అంటుంటే, ఈ వయస్సులో ఇలా ఉంటే ఆ వయస్సులో ఎలా ఉండేవాడో అని మరికొందరు కామెంట్ల వర్షం కనిపిస్తున్నారు.