ఘనంగా నిశ్చితార్థం జరుపుకున్న శాకుంతలం నిర్మాత నీలిమ గుణ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడుగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు గుణశేఖర్. పౌరాణిక చిత్రాలను తెరకెక్కించడంలో గుణశేఖర్ తర్వాతే ఎవరైనా అని చెప్పాలి.ఇలా దర్శకుడిగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న గుణశేఖర్ వారసురాలిగా ఇండస్ట్రీలోకి నీలిమ గుణ ఎంట్రీ ఇచ్చారు. ఈమె తన తండ్రి దర్శకత్వం వహిస్తున్న సినిమాలకు నిర్మాతగా మారారు. ఇలా నిర్మాతగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నటువంటి నీలిమ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని తెలుస్తోంది.ఈ క్రమంలోనే ఈమె నిశ్చితార్థానికి సంబంధించిన ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

నీలిమా గుణ కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంతో అట్టహాసంగా అంగరంగ వైభవంగా తన నిశ్చితార్థం జరుపుకున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోని నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ఫోటో క్షణాల్లో వైరల్ గా మారింది. ఇది చూసిన అభిమానులు ఈమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక నీలిమ గుణ చేసుకోబోయే వ్యక్తి పేరు రవి ప్రఖ్యా. ఈ ఫోటోలలో నీలిమ పసుపు రంగు చుడీదార్ వేసుకోగ రవి తెలుపు రంగు సార్వానితో ఎంతో చూడముచ్చటగా ఉన్నారు.

ఈ ఫోటోని నీలిమ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ..జీవితాంతం సాగే కొత్త ప్రయాణం మొదలైంది అంటూ ఈ ఫోటోని షేర్ చేశారు. ఈమే ప్రస్తుతం నిశ్చితార్థంకి సంబంధించిన ఫోటోను షేర్ చేయగా త్వరలోనే ఈమె పెళ్లికి సంబంధించిన తేదీని కూడా వెల్లడించనున్నట్లు తెలుస్తోంది.అయితే వరుడికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇక సినిమాల విషయానికి వస్తే నీలిమ గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన శాకుంతలం సినిమాకి నిర్మాతగా వ్యవహరించారు. ఇందులో సమంత కీలకపాత్రలో నటిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది.