జీవితంలో ఒక తోడు కావాలి.. వైరల్ అవుతున్న రేణు దేశాయ్ పోస్ట్!

రేణు దేశాయ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్యగా, నటిగా అందరికీ ఎంతో సుపరిచితమే. పవన్ కళ్యాణ్ తో కలిసి బద్రి సినిమాలో నటించిన ఈమె అనంతరం పవన్ కళ్యాణ్ ప్రేమలో పడి తనని వివాహం చేసుకున్నారు.వీరి వివాహమైన కొన్ని సంవత్సరాల పాటు వైవాహిక జీవితంలో సంతోషంగా గడిపిన ఈ జంట అనంతరం మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకున్నారు.పిల్లల బాధ్యతలను చూసుకుంటూ ఇండస్ట్రీకి దూరమైన రేణు దేశాయ్ ప్రస్తుతం తన పిల్లలతో కలిసి పూణేలో నివసిస్తున్నారు.

ఇలా ఇండస్ట్రీకి దూరమైనప్పటికీ ఈమె సోషల్ మీడియా వేదికగా తనకు సంబంధించిన విషయాలను తన పిల్లల కు సంబంధించిన విషయాలను షేర్ చేస్తూ ఉంటారు.ఇకపోతే తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా వరుస పోస్టులు చేయడంతో ఒక్కసారిగా ఈ పోస్టులు వైరల్ అవ్వడమే కాకుండా రేణు దేశాయ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నారా అని చర్చలకు దారి తీసాయి.పవన్ కళ్యాణ్ తో విడిపోయిన తర్వాత రేణు దేశాయ్ ఒంటరిగా గడుపుతున్నారు అయితే ఈమె గతంలో ఒక వ్యక్తితో నిశ్చితార్థం జరుపుకుందని వార్తలు వచ్చాయి అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఈ విధంగా రేణు దేశాయ్ నిశ్చితార్థపు ఫోటోలు వైరల్ అయినప్పటికీ,ఈమె పెళ్లి గురించి ఎలాంటి వార్తలు వినపడలేదు అయితే రహస్యంగా పెళ్లి చేసుకుందనే వార్తలు వినపడుతున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ..జీవితంలో అవసరం ఉన్నప్పుడు మనల్ని ముందుకు నడిపించడానికి ఒక తోడు కావాలి అంటూ సముద్రపు ఒడ్డున కూర్చుని ఉన్నటువంటి ఒక వీడియోని షేర్ చేస్తూ పోస్ట్ చేశారు. ఇక ఈ పోస్ట్ చేసిన అనంతరం ఈమె మరొక పోస్ట్ చేస్తూ నువ్వు నీ జీవితభాగస్వామిని వెతకడానికి ముందు నిన్ను నువ్వు అర్థం చేసుకో అంటూ ఇవే చేసిన పోస్ట్ వైరల్ అవ్వడంతో రేణు దేశాయ్ రెండో పెళ్లికి సిద్ధమవుతుందా అందుకే ఇలాంటి పోస్టులు చేశారా అని చర్చలు జరుగుతున్నాయి . మరి రేణు దేశాయ్ చేసిన ఈ పోస్ట్ వెనుక ఉన్న కారణం ఏంటో తెలియాల్సి ఉంది.