టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోగా కొనసాగుతున్న నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం కుర్ర హీరోలకు పోటీగా వరుస సినిమాలు చేస్తూ ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. గ తేడాది విడుదలైన అఖండ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవటంతో బాలకృష్ణ తన స్పీడు మరింత పెంచేశాడు. ప్రస్తుతం బాలకృష్ణ గోపీచంద్ మళ్లీ నేను దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఎన్బికె 107 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 50 శాతం పూర్తి చేసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా గురించి ఒక క్రేజీ న్యూస్ బయటికి వచ్చింది.
ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న బడా హీరోల సినిమాలు భారీ బడ్జెట్ తో తెరకెక్కటమే కాకుండా ఆ సినిమాల కలెక్షన్లు కూడా భారీ స్థాయిలో వసూలు అవుతున్నాయి. ఈ క్రమంలో థియేట్రికల్ వసూలు మాత్రమే కాకుండా నాన్ థియేట్రికల్ గా కూడా రికార్డ్ స్థాయిలో బిజినెస్ చేస్తున్నాయి. ఈ క్రమంలో బాలకృష్ణ నటిస్తున్న ఎన్బికె 107 సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ కూడా భారీ ధరకు అమ్ముడుపోయి బాలకృష్ణ సినీ కెరీర్ లోనే కొత్త రికార్డ్స్ క్రియేట్ చేశాయి.
బాలకృష్ణ కెరీర్ అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కుతున్న మొదటి సినిమా ఎన్.బి.కె 107. ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ కూడా రూ.58 కోట్లకు అమ్ముడుపోయి బాలకృష్ణ కెరీర్ లో కొత్త రికార్డ్ క్రియేట్ చేశాయి. దీంతో బాలయ్య అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమా క్రిస్మస్ కానుకగా విడుదల చేయటానికి సినిమా యూనిట్ ప్రయత్నిస్తోంది. మరి ఈ సినిమా అఖండ సినిమా స్థాయిలో బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందో? లేదో? చూడాలి మరి.