NBK 107 First Look : ఇన్సైడ్ టాక్..బాలయ్య ఫస్ట్ లుక్ విషయంలో అందుకే ఇలా చేసారా?

NBK 107 First Look : నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ అభిమానులు ఇప్పుడు ఓ రేంజ్ లో ఆనందంలో ఉన్నారని చెప్పాలి. లాస్ట్ భారీ హిట్ సినిమా “అఖండ” అనంతరం బాలయ్య మళ్ళీ అంతకు మించిన రేంజ్ లోనే మరో సాలిడ్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ని సెలెక్ట్ చేసి స్టార్ట్ చెయ్యడం వారికి గట్టి ట్రీట్ ఇచ్చే వార్తలా మారింది.

మరి నిన్ననే సినిమా నుంచి బాలయ్య ఫస్ట్ లుక్ ని కూడా మేకర్స్ రిలీజ్ చెయ్యడం సినిమాపై ఓ రేంజ్ హైప్ ని తీసుకొచ్చింది. అయితే ఇంత లుక్ ని రిలీజ్ చెయ్యడం కొంతమందికి కాస్త ఆశ్చర్యకరంగా అనిపించొచ్చు. కానీ ఇది మేకర్స్ నుంచి ఒక మంచి మూవ్ అనే చెప్పాలి.

అసలుకి ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా మొన్న షూటింగ్ స్టార్ట్ చేసుకున్న రోజునే ఈ సినిమా నుంచి బాలయ్య పూర్తి లుక్ లీక్ అయ్యి పెద్ద ఎత్తున వైరల్ అయ్యిపోయింది. అలాగే దాని తర్వాత మరో లీక్ కూడా బయటకి వచ్చింది. దీనితో ఇలా బాలేదని ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా ఫస్ట్ లుక్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసేసారు.

దీనితో ఆ లీక్ ఎఫెక్ట్ కి దెబ్బ కొట్టినట్టే అని చెప్పాలి. ఏది ఏమైనప్పటికీ మాత్రం బాలయ్య నయా లుక్ మరియు ఈ సినిమాతో మళ్ళీ భారీ హిట్ అందుకోవడం గ్యారెంటీ అనిపిస్తుంది. ఈ సినిమాని గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు.