హీరో కోసం టాలీవుడ్‌లో వెతుకుతోన్న నయన్ ‌తార.!

తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్ తెలుగులో ఓ సినిమా తెరకెక్కించబోతున్నాడట. నిజానికి తమిళ, తెలుగు భాషల్లో బైలింగ్వల్ మూవీగా రూపొందబోతోందట ఈ సినిమా.

ఈ సినిమా కోసం ఓ తెలుగు హీరో కోసం చూస్తున్నాడట విఘ్నేష్ శివన్. తన సతీమణి నయన తారకు ఈ పని అప్పగించాడట. ఆ పనిలో బిజీగా వుందట నయన తార.

ఏ హీరోని సెలెక్ట్ చేయాలా.? అని ఆలోచిస్తోందట. ఈ సినిమాకి నిర్మాణ పరంగా నయన తార బాధ్యతలు తీసుకోనుందనీ తెలుస్తోంది.

మరి, ఈ సినిమాలో తాను హీరోయిన్‌గా నటిస్తుందా.? లేదంటే, కేవలం నిర్మాతగా మాత్రమే బాధ్యత తీసుకుని భర్తకు సపోర్ట్‌గా వుంటుందా..? అనేది ఇంకా స్పష్టత రావల్సి వుంది.

టాలీవుడ్ నుంచి ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ సినిమా నిర్మాణంలో భాగం పంచుకోనుందనీ ప్రచారం జరుగుతోంది. ఇకపోతే, నయన తార ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలపై ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే.

తాజాగా ‘జవాన్’ సినిమాలో షారూఖ్ ఖాన్‌తో కలిసి స్ర్కీన్ షేర్ చేసుకుంది. ఈ సినిమా మంచి సక్సెస్ అయ్యింది. షారూఖ్, నయన తార జంటకూ మంచి రెస్పాన్స్ వచ్చింది.

దాంతో, నయన తారకు మరికొన్ని బాలీవుడ్ ఆఫర్లు వస్తున్నాయన్న ప్రచారం జరుగుతోంది. అందులో స్టార్ హీరోసల్మాన్ ఖాన్ సినిమా ఆల్రెడీ ఓకే అయ్యిందన్న టాక్. అలాగే షారూఖ్‌తోనే ఇంకో సినిమాకి కమిట్ అయ్యిందన్న ప్రచారం కూడా వినిపిస్తోంది. చూడాలి మరి, ఇటు సౌత్‌లో నిర్మాతగా.. అటు నార్త్‌లో హీరోయిన్‌గా రెండు పడవల ప్రయాణం నయన్ ఎలా చేస్తుందో.!