నయనతార అంటే లేడీ సూపర్ స్టార్.. ఇది తమిళనాట వినిపించే మాట.! ఓ సాధారణ సబ్జెక్ట్‌ని నయనతార దగ్గరకు తీసుకెళ్ళి, రెమ్యునరేషన్‌తో ఆమెని ఒప్పించేస్తే, మంచి వసూళ్ళు వచ్చేస్తాయ్.. అందులో సరైన కంటెంట్ వున్నా లేకున్నా.
అదీ, నయనతార రేంజ్.! అలాగని, నయనతార అన్నీ చెత్త సినిమాలే చేస్తుందనీ అనలేం. మంచి మంచి సినిమాలూ చేస్తుంటుందామె. అలా తనకున్న లేడీ సూపర్ స్టార్ ఇమేజ్‌ని ఆమె కాపాడుకుంటూ వస్తోంది. అదే సమయంలో, కాసులు వెనకేసుకోవడంలో ఆమె తర్వాతే ఎవరైనా.
తాజా ఖబర్ ఏంటంటే, ఓ టాలీవుడ్ నిర్మాత తాజాగా నయనతారతో ఓ ప్రాజెక్ట్ విషయమై చర్చించాడట. ఓ యంగ్ డైరెక్టర్ చెప్పిన కథని, ఆమె ముందర పెట్టాడట. రెమ్యునరేషన్ విషయంలోనే అడుగు ముందుకు పడటంలేదన్నది ఇన్‌సైడ్ సోర్సెస్ కథనం.
సినిమా తమిళ నేటివిటీలోనే వుంటుందిగానీ, తెలుగు సినిమా.. అన్న యాంగిల్‌లోనే తీయబోతున్నారట. రెమ్యునరేషన్ గట్టిగానే నిర్మాత ఆఫర్ చేసినా, అంతకన్నా ఎక్కవ కోట్ చేస్తోందిట నయనతార.
రెమ్యునరేషన్ విషయమై నయనతార ఏమాత్రం సర్దుకున్నా, సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్ళే అవకాశముంది. నయనతార కాకపోతే ఎవరు.? అన్న ఆలోచన కూడా ఆ నిర్మాత చేయడంలేదని తెలుస్తోంది.
త్రిషని ట్రై చేయొచ్చు కదా.? అంటే, నయనతారే బెస్ట్ అని అంటున్నాడట ఆ నిర్మాత. ‘నయనతారని అస్సలు తట్టుకోలేం’ అని ఎవరు వారించినా వినడంలేదట.