Bheemla Nayak: నాయక్ లోని లా..లా.. భీమ్లా .. పాట కోసమైనా సినిమా ఒకసారి చూడాలని వుంది: రాజ్ తరుణ్

Bheemla Nayak: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా భీమ్లా నాయక్ ఇటీవలే రిలీజ్ ఆయ్యి బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ వసూలు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. కాగా ఇన్ని రోజులు ఈ సినిమా చూసేందుకు మామూలు ప్రేక్షకులే కాదు సినీ సెలబ్రెటీలు సైతం ఎదురు చూశారంటే ఆయనకున్న క్రేజ్ అలాంటిది మరి.

ఐతే ఈ సినిమా రిలీజ్ అయ్యి రోజులు గడుస్తున్నా తాను ఇంకా చూడలేదని హీరో రాజ్ తరుణ్ అన్నారు. రోజు నైట్ షూట్ లు, దానికి తోడు ఇంటర్వ్యూలు ఉండడం వల్ల అసలు తనకు గ్యాప్ దొరకడం లేదని ఆయన చెప్పుకొచ్చారు. ఎక్కడ చూసినా అదిరి పోయిందని టాకే వినిపిస్తుందని, దాంతో ఆ సినిమా చూడాలని ఆత్రుత ఇంకా ఎక్కువ అయిందని ఆయన చెప్పారు. ఏ మాత్రం టైం దొరికినా వెళ్లి ఆ సినిమా చూసి వస్తానంటూ ఆయన నవ్వుతూ చెప్పారు.

ఇకపోతే భీమ్లా నాయక్ సినిమాలోని లా.. లా.. భీమ్లా అనే సాంగ్ చాలా బాగుందని, తనకు చాలా నచ్చిందని కూడా ఆయన సంతోషం వ్యక్తం చేశారు. కనీసం ఆ పాట చూడడం కోసమైనా సరే ఒకసారి ఆ సినిమా చూడాలని ఉందని ఆయన చెప్పారు. తాను ఏం చేసినా ఆ పాటనే హమ్ చేస్తూ ఉన్నానని ఆయన చెప్పారు. సమయం చూసుకొని కచ్చితంగా ఆ సినిమా చూస్తానని రాజ్ తరుణ్ తెలిపారు.