యాంకర్ రవి ప్రస్తుతం సంక్రాంతి ఈవెంట్‌తో బిజీగా ఉన్నాడు. స్టార్ మాలో ఇట్సే ఫ్యామిలీ పార్టీ అంటూ ఈవెంట్‌లో దుమ్ములేపుతున్నాడు. ఐదేళ్ల తరువాత లాస్యతో కలిసి చేస్తోన్న ఈవెంట్ కాబట్టి అందరి దృష్టి దాని మీదే పడింది. మొత్తానికి ఇలా రవి లాస్య ఒకే స్టేజ్ మీద ఇన్నేళ్ల తరువాత ఓ షోను హోస్ట్ చేయడం చూసి ఎంతో మంది సంతోషిస్తున్నారు. ఒకప్పుడు వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉండేది వ్యవహారం.
అయితే లాస్య రవి శ్రీముఖి మధ్య జరిగిన కోల్డ్ వార్ కూడా అందరికీ తెలిసిందే. రవి లాస్య ఎంతగా ఫేమస్ అయ్యారో.. లాస్య వేరుపడ్డాక ఆ ప్లేస్‌లో శ్రీముఖి వచ్చి చేరింది. శ్రీముఖి వచ్చి చేరడమే కాదు.. మేకులా వచ్చి ఏకై కూర్చుంది. రవి లాస్యను మించి రవి శ్రీముఖి జంట పాపులర్ అయింది. ఆ సమయంలో శ్రీముఖి లాస్యల మధ్య కూడా అంతగా మాటలు ఉండేవి కాదు. అయితే తాజాగా మళ్లీ రవి లాస్య మధ్య శ్రీముఖి టాపిక్ వచ్చింది.
ఆ టాపిక్ తెచ్చింది నవ్యస్వామి.. అలా రావడానికి కారణం మాత్రం రవినే. మా ఇద్దరిని ఇలా చూస్తే ఏమనిపిస్తోందంటూ అందరినీ అడుగుతూ వచ్చాడు రవి. అదే విధంగా నవ్యస్వామిని కూడా అడిగాడు. కానీ ఆమె చెప్పిన ఆన్సర్‌తో రవికి దిమ్మతిరిగింది. శ్రీముఖిని మిస్ అవుతున్నాను అంటూ రవికి గట్టిగా కౌంటర్ ఇచ్చింది. అలా మళ్లీ రవి లాస్య శ్రీముఖి మధ్య ఉన్న వ్యవహారం హాట్ టాపిక్ అవుతోంది.
A Big Salute to all the Farmers across the globe. Let’s dedicate this festival to them!!!#ItsAFamilyParty Jan 14th at 12 PM on @StarMaa
#SankranthiSpecial pic.twitter.com/1iRbDJSA73
— starmaa (@StarMaa) January 10, 2021