హీరోయిన్ పరువుతీసేశాడు.. నవీన్ పొలిశెట్టి కామెంట్స్ వైరల్

Naveen Polishetty About Faria Abdullah

నవీన్ పొలిశెట్టి తెరపై ఎంత సరదాగా ఉంటాడో తెర వెనుకా అంతే సరదాగా ఉంటాడు. ఎప్పుడో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా కూడా ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయతో గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే దీని కంటే ముందుగా బాలీవుడ్‌లో నటుడిగా గుర్తింపు లభించింది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సినిమాలో నటించి అందరినీ ఆకట్టుకున్నాడు. తెలుగులోనే నవీన్ లేటుగా క్రేజ్ తెచ్చుకున్నాడు. లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాలో చిన్న పాత్రలో మెరిశాడు నవీన్.

Naveen Polishetty About Faria Abdullah

అయితే ఏజెంట్ సినిమాతో నవీన్‌కు మంచి పాపులారిటీ రావడమే కాకుండా ఇమేజ్ పెరిగింది. అంతే కాకుండా నవీన్ కామెడీ టైమింగ్‌ను నెటిజన్లు ఇష్టపడుతుంటారు. తాజాగా నవీన్ పొలిశెట్టి జాతిరత్నాలు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నాడు. సినిమా ప్రమోషన్స్‌లొ భాగంగా జాతిరత్నాలు టీం సుమ క్యాష్ షోలో పార్టిసిపేట్ చేసింది. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో నవీన్ తెగ సందడి చేసేశాడు.

ఓ వైపు సుమ పంచ్‌‌లు.. మరో వైపు నవీన్ సెటైర్లతో ప్రోమో అదిరింది. సెట్‌లో ఒక్క రోజు మాత్రం నవీన్ సరైన టైంకు వచ్చాడని దర్శకుడు చెప్పడం.. ప్రియదర్శి, రాహుల్ మాత్రం కరెక్ట్ టైంకు వస్తారని దర్శకుడు మెచ్చుకోవడం.. టైంకు వస్తారు కానీ డేట్స్ మారతుంటాయని నవీన్ కౌంటర్లు వేయడం అదిరిపోయింది. ఇక ఈ సినిమాను 2020లో విడుదల చేయాలని అనుకున్నాం కానీ హీరోయిన్ ఫరియా మేకప్‌ వల్ల లేట్ అయిందంటూ పక్కనే ఉన్న ఆమె పరువును తీసేశాడు.