పదో తరగతిలోనే ఆ పనులు.. నవదీప్ చాలా ముదురు!!

టాలీవుడ్‌లో హీరో, విలన్, సైడ్ క్యారెక్టర్స్ ఇలా ఎలాంటి పాత్రల్లోనైనా, ఎలాంటి ఎమోషన్స్‌ను అయినా పండించే అతి కొద్ది మంది నటుల్లో నవదీప్ ఒకరు. అలాంటి నవదీప్ ప్రస్తుతం వెబ్ సిరీస్‌లతో బిజీగా ఉన్నాడు. అక్కడ మనోడికి గిరాకీ చాలానే ఉంది. అదిరిపోయే పర్ఫామెన్స్‌తో ఆకట్టుకుంటున్నాడు. లాక్ డౌన్‌లో నవదీప్ నటించిన వెబ్ సిరీస్‌లు బాగానే క్లిక్ అయ్యాయి. అయితే నవదీప్ గురించి తాజాగా కొన్ని విషయాలు బయటకు వచ్చాయి.

Navdeep Tried To Kiss In Tenth Class,Navdeep, Ali
Navdeep Tried To Kiss In Tenth Class,Navdeep, Ali

నవదీప్ అని అనడంతో అందరూ నాటీ స్టార్ అంటూ అదోలా చూస్తారు. నవదీప్‌కు ఎలా వచ్చిందో ఏమో గానీ ప్లేబాయ్ అనే ట్యాగ్ వచ్చింది. ఆ పేరును సార్థకం చేసుకునేలా నవదీప్ కొన్ని సినిమాలు, పోస్ట్‌లు చేస్తుంటాడు. ఐస్ క్రీం సినిమాలో ఓ లెవెల్‌లో నటించడం, సన్నీలియోన్‌త్ కలిసి వెబ్ సిరీస్‌లో నటించడం, సోషల్ మీడియాలోనూ నవదీప్ సన్నీలియోన్‌తో సరసాలు ఆడటంతో అందరూ ఓ రకంగా ఫిక్స్ అయ్యారు.

దానికి తోడు తాజాగా కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. అలీతో సరదాగా షోలో నవదీప్ గెస్ట్‌గా రాబోతోన్నాడు. వచ్చే వారానికి సంబంధించిన ప్రోమో కాసేపటి క్రితమే విడుదలైంది. అందులో నవదీప్ సీక్రెట్ ఒకటి బయట పడింది. పదో క్లాస్‌లో ముద్దు ఎలా పెట్టాలో రోజంతా ట్రెయినింగ్ తీసుకున్నావట కదా? అని అలీ ప్రశ్నించాడు. అది మీకెవరు చెప్పారు అని నవదీప్ షాక్ అయ్యాడు. ఆ అమ్మాయే చెప్పిందంటూ అలీ కౌంటర్ వేశాడు. ఏదైనా ఎవరో ఒకరి దగ్గరి నుంచి నేర్చుకోవాలి కదా అని నవదీప్ అనేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.

Alitho Saradaga | Navdeep (Hero) |  2nd November  2020 | Latest Promo | ETV Telugu