నవదీప్ అనుకుని పప్పులో కాలేశారు.. వారి కోసం మౌనం పాటిస్తున్నానంటోన్న హీరో!!

Navdeep Shares a Pic Looks Similar To Him

నవదీప్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటాడో అందరికీ తెలిసిందే. నెటిజన్ల ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ.. వారితో నిత్యం టచ్‌లో ఉంటాడు. కరెంట్‌గా జరిగే విషయాలపై సెటైర్లు వేస్తుంటాడు. ఇంత వరకు వెండితెరపై సందడి చేసిన నవదీప్ ఇప్పుడు బుల్లితెరపై, సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నాడు. ఇన్ని రోజులు అదిరిందిలో హల్చల్ చేశాడు.. దీపావళి, దసరా ఈవెంట్లంటూ దుమ్ములేపాడు. నవదీప్ సోషల్ మీడియాలో అప్పుడప్పుడు కొన్ని ఫోటోలను షేర్ చేస్తుంటాడు.

Navdeep Shares a Pic Looks Similar To Him
Navdeep Shares a Pic Looks Similar To Him

తనలాగే గడ్డం, హెయిర్ స్టైల్ పెంచుకున్న వారి ఫోటోలను షేర్ చేస్తాడు. ఆమధ్య అచ్చం తనలాగే రూపు రేఖలున్నా వ్యక్తుల ఫోటోలను షేర్ చేశాడు. నవదీప్‌కు పర్సనల్‌గా ఫ్యాన్స్ చేసే మెసెజ్‌లు, ఫోటోలను వారి పర్మిషన్‌తో తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేస్తుంటారు. నెటిజన్లు కూడా తమకేమీ అభ్యంతరం లేదు.. ఆ ఫోటోలను షేర్ చేసుకోండని సమాధానం ఇస్తారు. అలా కొన్ని ఫోటోలను ఆ మధ్య షేర్ చేశాడు. ఆఫోటోల్లో ఉన్న వ్యక్తులు నవదీప్‌కు జిరాక్సుల్లా ఉన్నారు.

అయితే తాజాగా నవదీప్ మరో ఫోటోను షేర్ చేశాడు. ఆ ఫోటోను సడెన్‌గా చూస్తే ఆ గడ్డం, ఆ మొహం చూస్తుంటే అది నవదీప్ అని అందరూ పప్పులో కాలేశారు. నవదీప్ 10.ఓ అంటూ కామెడీగా ఆ ఫోటోను షేర్ చేశాడు. అది నేనే అని భ్రమపడి పప్పులో కాలేసిన వారి గురించి కొన్ని క్షణాలు మౌనం పాటిస్తున్నా అంటూ సెటైర్లు వేశాడు. మొత్తానికి తనలా చాలా మందే ఉన్నారని నవదీప్‌ చెప్పకనే చెబుతున్నాడు. నవదీప్ మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చేందుకు అద్భుతమైన కథతో రెడీ అవుతున్నాడట.