న్యాచురల్ స్టార్ నానికి పిల్లలు, పెద్దలు అనే తేడాల్లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకుల్లో అభిమానులు ఉన్నారు. నానితో సినిమాలను నిర్మించే నిర్మాతలు భారీ బడ్జెట్ తో సినిమాలను నిర్మించే విషయంలో వెనుకడుగు వేయడం లేదు. నాని హీరోగా నటించిన అంటే సుందరానికి, దసరా సినిమాలు ఈ ఏడాదే థియేటర్లలో విడుదల కానున్నాయనే సంగతి తెలిసిందే. అయితే నానికి హీరోగా గుర్తింపు రావడానికి కారణమైన సినిమా మాత్రం అష్టాచమ్మా అని తెలిసిందే.
ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాతోనే నాని నటుడిగా పరిచయం అయ్యారు. తొలి సినిమాతోనే హీరోగా మంచి మార్కులు సంపాదించుకున్న నాని ఆ తర్వాత వరుసగా సినిమా ఆఫర్లతో బిజీ అయ్యారు. నాని పలు ప్రయోగాత్మక కథలలో నటించినా ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. అయితే నాని తొలి సినిమాకు రెమ్యునరేషన్ తీసుకోకుండానే పని చేశారని సమాచారం.
అయితే అష్టాచమ్మా సినిమా సక్సెస్ సాధించి లాభాలు రావడంతో నిర్మాత నానికి సినిమా రిలీజైన తర్వాత 5 లక్షల రూపాయల రెమ్యునరేషన్ ఇచ్చారని తెలుస్తోంది. ఈ విధంగా తొలి సినిమాకు నాని 5 లక్షల రూపాయలను పారితోషికంగా తీసుకున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం నాని ఒక్కో సినిమాకు 10 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.
క్రేజ్, మార్కెట్ అంతకంతకూ పెరుగుతున్నా నాని మాత్రం పరిమితంగానే రెమ్యునరేషన్ ను డిమాండ్ చేస్తున్నారు. నాని తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. కెరీర్ విషయంలో నాని జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. తర్వాత సినిమాలతో నానికి ఎలాంటి ఫలితాలు దక్కుతాయో చూడాల్సి ఉంది.