NTR : ఎన్టీఆర్ కు నేషనల్ అవార్డు పక్కా అంటున్న బాలీవుడ్ క్రిటిక్….!

NTR : నందమూరి వారసుడు ఎన్టీఆర్ తన ప్రతిభతో ఒక్కోమెట్టు ఎక్కుతూ సినీ పరిశ్రమలో టాప్ హీరో రేంజ్ కి వెళ్ళాడు. ఎంత ఎత్తుకు వెళ్లిన ఒదిగి ఉన్నాడు ఎన్టీఆర్. తన నటనతో డాన్సులతో అందరిని అకట్టుకున్నాడు. ప్రతి సినిమాలోనూ తన నటన ప్రతిభతో సీనియర్ నటులతో పోటీపడుతూ అభిమానులను సంతోషపెడుతున్నాడు.

ఇక మూడేళ్లుగా ఎదురుచూస్తున్న జక్కన్న సినిమా ఆర్ఆర్ఆర్ విడుదలయింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటించాడు. ఇక ఎన్టీఆర్ నటన గురించి అభిమానులకు ఎటువంటి సందేహం లేదు ఇక ఇటు విమర్శకులు కూడా తన నటనకు ఫిదా అవుతుంటే అభిమానుల్లో ఆనందం రెట్టింపుఅయింది.ఇక తాజాగా సినిమా గురించి చాలా మంది విమర్శకులు రివ్యూ ఇచ్చారు.

ఇక బాలీవుడ్ ప్రముఖ క్రిటిక్ ఉమర్ సంధు కూడా ఆర్ఆర్ఆర్ కు రివ్యూ ఇచ్చారు. ఎన్టీఆర్ కు నేషనల్ అవార్డ్ పక్కా అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఆర్ఆర్ఆర్ మూవీకి 5 రేటింగ్ ఇచ్చిన ఉమైర్ సంధు చాలారోజుల నుంచి ఈ సినిమా గురించి పాజిటివ్ గా ప్రచారం చేస్తూ వచ్చారు. తారక్ కు ఆర్ఆర్ఆర్ గేమ్ ఛేంజర్ అవుతుందని కొన్నిరోజుల క్రితం ఉమైర్ సంధు వెల్లడించిన సంగతి తెలిసిందే.

మరోవైపు ఆర్ఆర్ఆర్ కలెక్షన్లు ఏ విధంగా ఉండబోతున్నాయనే చర్చ జరుగుతోంది. ఆర్ఆర్ఆర్ పైరసీ విషయంలో జక్కన్న అతని బృందం కఠినంగా వ్యవహరించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఆర్ఆర్ఆర్ బాక్సాఫీస్ వద్ద మైండ్ బ్లాంక్ అయ్యే రేంజ్ లో రికార్డులు సృష్టిస్తుందని అభిమానులు భావిస్తున్నారు. 500 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజ్ కు ముందే నిర్మాతకు భారీస్థాయిలో లాభాలను అందించింది.