2020 టాలీవుడ్ బ్లాక్ బస్టర్ అంటే మొదట చెప్పుకోవలసింది బన్నీ నటించిన ఆలా వైకుంఠపురంలో. ఈ సినిమా లో ఒక ప్రత్యేక పాత్రలో నటించారు సుశాంత్. సుశాంత్ కెరీరంతా మీడియం బడ్జెట్ సినిమాలే. ఇంత పెద్ద హిట్ సినిమాలో భాగస్వామ్యం కావడం సుశాంత్ కు ఇదే మొదటిసారి. పాత్ర చిన్నదైనా సుశాంత్ రీచ్ ను పెంచిన సినిమా ఆలా వైకుంఠపురం లో.
అంత పెద్ద హిట్ సినిమా తర్వాత బన్నీ నటిస్తున్న చిత్రం పుష్ప. రంగస్థలం లాంటి సంచలన హిట్ తర్వాత సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం పుష్ప కావడం విశేషం. బన్నీ సుకుమార్ కాంబినేషన్ కూడా మంచి హిట్ కాంబినేషన్. వీరిద్దరి కంబినేషన్లో ఆర్య లాంటి ఎంటర్టైనర్ గతంలో ప్రేక్షకులను అలరించింది.
ఈ నేపథ్యంలో పుష్ప మీద ప్రేక్షకులకు భారీ అంచనాలున్నాయి. పుష్పాలో కూడా హీరో తర్వాత హీరో అంత ప్రాముఖ్యత వున్న పాత్ర ఒకటి ఉందట. ఆ పాత్రకు, తెలుగు సినిమా పరిశ్రమలో ప్రయోగాలతో తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకున్న నారా రోహిత్ ని అనుకున్నారట. నారా రోహిత్ కూడా తన డేట్లు పుష్పకు కేటాయించారు కూడా. అయితే సడన్ గా నారా రోహిత్ తాను పుష్ప చేయడంలేదని సుకుమార్ కు కబురంపారట.
ఎందుకని చేయడంలేదని లోతుల్లోకి వెళితే, కరోనా వల్ల నారా రోహిత్ పుష్పకు ఇచ్చిన డేట్స్ వాడుకోకుండానే వేస్ట్ అయిపోయాయట. ఇప్పుడు నారా రోహిత్ సొంత బ్యానేర్లో చిత్రం ప్లాన్ చేసుకుంటున్నారు కాబట్టి పుష్ప చేయలేరని తెలిసింది. విషయం తెలిసినప్పటి నుండి సుక్కు అండ్ టీం నారా రోహిత్ స్థానం లో ఎవరిని తీసుకొవాలి అని తర్జనభర్జన పడుతున్నారట. నారా రోహిత్ కోసం రాసిన పాత్ర ని ఎవరు చేస్తే వారికి అనుగుణంగా పాత్రని మలచాల్సివుంటుంది సుకుమార్.
ఆ విధంగా అల్లు అర్జున్ , నారా రోహిత్ కాంబినేషన్ స్క్రీన్ మీద చూడడం మిస్ అయ్యారు తెలుగు ప్రేక్షకులు.