నానీగారూ.! ఇది టూమచ్ కదా.?

చాలా ఓవర్ కాన్ఫిడెంట్‌గా కనిపిస్తున్నాడు హీరో నాని.! తన తాజా చిత్రం ‘దసరా’ విషయంలో నాని చెబుతున్న మాటలు సహజంగానే కొంత ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఏకంగా సుకుమార్‌తో దర్శకుడు శ్రీకాంత్ ఓదెలను పోల్చేశాడు నాని.

దీనిపై పెద్ద దుమారమే చెలరేగుతోంది. నాని ఓవరాక్షన్ నేపథ్యంలో ‘దసరా’ ఫ్లాప్ అవ్వాలి.. అని కొందరు సినీ అభిమానులు కోరుకుంటున్నారు. ఇదెక్కడి పంచాయితీ.? సినిమా కోసం చాలామంది చాలా కష్టపడ్డారు. నాని అత్యుత్సాహానికి.. సినిమానెందుకు నాశనం చేయడం.?

నాని కూడా తన గత సినిమాల పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని కొంత బ్యాలెన్స్‌డ్‌గా మాట్లాడితే మంచిది. కానీ, నాని తగ్గేదే లే.. అంటున్నాడు. పాన్ ఇండియా హిట్టు కొట్టేస్తామంటున్నాడు. కథ మీద కాన్ఫిడెన్సా.? లేదంటే, హైప్ క్రియేట్ చేయడం కోసమా.?

నాని హైప్ పాట్లు కాస్తా, ‘దసరాకి’ మైనస్ అవుతాయేమోనన్న భయం మేకర్స్‌లో వుంది. కానీ, నానిని కంట్రోల్ చెయ్యలేరు కదా.!