ఏమండోయ్ నానీగారూ.! వచ్చిందా.? లేదా.?

నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ‘దసరా’ విడుదలకు సిద్ధమైంది. కీర్తి సురేష్ ఈ సినిమాలో హీరోయిన్. ప్రమోషన్స్ షురూ అయ్యాయి. బజ్ ఓ మోస్తరుగా క్రియేట్ అయ్యింది.!

పాన్ ఇండియా.. అంటూ ఈ సినిమా గురించి ప్రచారమైతే జరుగుతోంది. కానీ, ఇది సరిపోదు.! నిజానికి, వుండాల్సినంత బజ్ అయితే ప్రస్తుతానికి క్రియేట్ అవ్వలేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

నార్త్ ఆడియన్స్ ఇంకా ఈ సినిమా గురించి అంత సీరియస్‌గా తీసుకోవడంలేదు. తమిళనాడులోనూ పెద్దగా బజ్ వినిపించడంలేదాయె. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ‘దసరా’ సందడి ఓ మోస్తరుగా కనిపిస్తోంది.

‘ఓ ఆర్ఆర్ఆర్.. ఓ కేజీఎఫ్.. ఓ దసరా’ అంటూ కొన్నాళ్ళ క్రితం తన సినిమా గురించి చెప్పుకునాడు నాని. కానీ, అంత లేదు నానీగారూ.. అనే మాట అంతటా వినిపిస్తుండడం గమనార్హం.