Nani V trailer.. ట్రైలర్ మాత్రం అదిరిపోయింది.. సినిమా రిలీజ్ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్

Nani v trailer released

నాని కొత్త సినిమా వీ రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో తాజాగా సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. సినిమా హక్కులను అమెజాన్ ప్రైమ్ తీసుకోవడంతో ట్రైలర్ ను కూడా అమెజాన్ యూట్యూబ్ చానెల్ లోనే విడుదల చేశారు.

Nani v trailer released
Nani v trailer released

నిజానికి ఇది నాని ఫుల్ లెన్త్ సినిమా కాదు. నానిది ఈ సినిమాలో డిఫరెంట్ రోల్. మరో కీలక పాత్రలో సుధీర్ బాబు నటించాడు.

తాజాగా విడుదలైన ట్రైలర్ ను చూస్తే సినిమా సూపర్ డూపర్ హిట్టే అంటూ నాని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. సరికొత్త కథతో మోహన్ కృష్ణ ఇంద్రగంటి ఈ సినిమాను తెరకెక్కించాడని సినిమా ట్రైలర్ చూస్తేనే అర్థం అవుతోంది.

ఈ సినిమా సెప్టెంబర్ 5న అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కానుంది. ఈ సినిమాను థియేటర్లలోనే రిలీజ్ చేద్దామని మూవీ యూనిట్ భావించినా.. కరోనా వల్ల థియేటర్లు మూతపడిపోయాయి. ఇప్పటి వరకు తెరుచుకోలేదు. ఎప్పుడు తెరుచుకుంటాయో కూడా స్పష్టత లేదు.

వీ సినిమా షూటింగ్ పూర్తయి కూడా చాలారోజులు అవుతోంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా ముందే పూర్తి చేసుకొని రిలీజ్ కోసం వెయిట్ చేసింది. థియేటర్లు ఓపెన్ కాకపోవడంతో మూవీ యూనిట్ ఓటీటీలో సినిమాను రిలీజ్ చేయడానికి ఓకే చెప్పేశారు.

దీంతో మొట్టమొదటిసారి నాని సినిమా ఓటీటీలో రిలీజ్ అవుతోంది. ఇక.. ఈ సినిమాలో నాని సరసన అదితిరావు హైదరీ నటించగా… సుధీర్ బాబు సరసన నివేత థామస్ నటించింది.

V - Official Trailer | Nani, Sudheer Babu, Aditi Rao Hydari, Nivetha Thomas | Sept 5