వైరల్ : నెపోటిజం పై నాని ఊహించని కామెంట్స్.!

film-companion_import_wp-content_uploads_2022_06_Nani

గత కొన్నేళ్ల నుంచి సినీ వర్గాల్లో అది టాలీవుడ్ అయినా కోలీవుడ్ అయినా బాలీవుడ్ అయినా కూడా ప్రతి ఇండస్ట్రీ నుంచి కూడా నెపోటిజం అనే మాట బాగా వినబడుతూ వస్తుంది. మరి బాలీవుడ్ సినిమా దగ్గర వెరీ టాలెంటెడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ చనిపోవడంతో ఇది పెద్ద ఎత్తున వెలుగులోకి వచ్చింది.

కాగా అక్కడ నుంచి టాలీవుడ్ హీరోలపై కూడా ఇది బాగా స్ప్రెడ్ అయ్యింది. మెగా ఫ్యామిలీ, నందమూరి అక్కినేని ఇలా ఇతర ఫ్యామిలీ లపై కొందరు చాలా ఎక్కువ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ నెపోటిజం పై టాలీవుడ్ లో ఎలాంటి అండ లేకుండా స్టార్ హీరోగా ఎదిగిన నాచురల్ స్టార్ నాని లేటెస్ట్ గా పలు ఆసక్తికర కామెంట్స్ చేయడం వైరల్ గా మారింది.

స్మిత టాక్ షో లో పాల్గొన్న తాను టాలీవుడ్ లో నెపోటిజం ఉందో లేదో అనే దానిపై అదిరే కామెంట్స్ చేసాడు. టాలీవుడ్ లో నెపోటిజం ఉన్నట్టయితే నా మొదటి సినిమాని లక్ష మంది చూసారు నెక్స్ట్ కోటి మంది చూస్తున్నారు. అంటే టాలీవుడ్ లో నెపోటిజం ఎక్కడ ఉంది? ఎవరు ఎంకరేజ్ చేస్తున్నారు టాలీవుడ్ లో వాళ్ళు చేస్తున్నట్టా లేక ఆడియెన్స్ దాన్ని ఎంకరేజ్ చేస్తున్నట్టా అని అదిరే సమాధానం అందించాడు.

దీనితో టాలీవుడ్ లో ఎలాంటి నెపోటిజం లేదని ఎలా ఉన్నా ఎవరినైనా తెలుగు ఆడియెన్స్ ఆదరించడం అనేది మాత్రం తప్పకుండా ఉంటుంది అని తెలుగు ఆడియెన్స్ ని పొగడడం విశేషం. నాని ఆన్సర్ తో స్మిత కూడా అవాక్కవడం విశేషం. దీనితో నాని సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.