ధరణి.. జెర్సీ మూమెంట్.. రెండు గొడ్డళ్ళు పట్టుకున్న జెర్సీ అర్జున్

నేచురల్ స్టార్ నాని నటించిన దసరా మూవీ తాజాగా రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అలాగే అతని కెరియర్ లో హైయెస్ట్ ఫస్ట్ డే కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా ఈ మూవీ నిలిచింది. ఓవర్సీస్ లో కూడా రికార్డ్ స్థాయిలో గ్రాస్ కలెక్ట్ సొంతం చేసుకోవడం విశేషం.

ఇక సినీ విమర్శకుల నుంచి సామాన్య ప్రేక్షకుల వరకు అందరూ కూడా దసరా సినిమా చూసిన తర్వాత నాని పెర్ఫార్మెన్స్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. అలాగే కల్ట్ మూవీగా నాని కెరియర్ లో ఈ సినిమా నిలిచిపోతుంది అనే మాట వినిపిస్తుంది. ఇతర భాషల సంగతి ఎలా ఉన్న తెలుగులో మాత్రం ప్రేక్షకులకి భాగా రీచ్ అయ్యింది. అయితే ఈ వీకెండ్ లో మూవీకి కలెక్షన్స్ ఎలా వస్తాయి అనేదానిపై సినిమా సక్సెస్ ఆధారపడి ఉంటుంది.

ఇదిలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో ఓ ఇంటరెస్టింగ్ పోస్టర్ వైరల్ అవుతుంది. జెర్సీలోని అర్జున్ క్యారెక్టర్ రైల్వే స్టేషన్ దగ్గరకి వెళ్లి ట్రైన్ వచ్చినపుడు గట్టిగా కేకలు వేస్తాడు. ఈ సీన్ జెర్సీ మూవీకి హైలైట్ అని చెప్పాలి. ఇప్పుడు ఆ అర్జున్ చేతిలో దసరా సినిమాలోని నాని పోషించిన ధరణి పాత్ర ఉపయోగించే ఆయుదాలైన రెండు గొడ్డళ్ళు మార్ఫింగ్ చేసి పెట్టారు.

ఈ ఫోటో చూసిన అందరూ కూడా నానికి కరెక్ట్ గా ఈ క్యారెక్టర్ సెట్ అయ్యింది అనే మాట చెబుతున్నారు. ధరణి క్యారెక్టర్ క్లైమాక్స్ లో ఊపు తీసుకొచ్చింది ఆ రెండు గొడ్డళ్ళు ఇప్పుడు రాజమౌళి వెపన్స్ అంత ఫేమస్ అయిపోయాయి. దీంతో వాటిని అర్జున్ క్యారెక్టర్ చేతిలో పెట్టి ఆ ఫోటోని వైరల్ చేస్తున్నారు.

ఈ మూవీకి లభిస్తున్న ఆదరణ, ప్రశంసలు ఆశ్వాదిస్తున్న నాని ఆనందానికి అవధులు లేవనే మాట వినిపిస్తుంది. అతను ఏ స్థాయిలో ధరణి పాత్రకి వస్తున్న ప్రశంసలు ఆశ్వాదిస్తున్నాడు అనేది ఈ ఫోటోతోనే రిప్రజెంట్ చేయొచ్చు అనే కామెంట్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.