టాలీవుడ్ సినిమా సినిమా దగ్గర టైర్ 2 హీరోస్ లో అయితే తన లాస్ట్ సినిమా దసరా తో తిరుగు లేని రికార్డ్స్ సెట్ చేసిన నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన తదుపరి చిత్రమే “హాయ్ నాన్న”. మరి ఈ చిత్రం కూడా నాని కెరీర్ లో ఎమోషనల్ హిట్ అయినటువంటి జెర్సీ తరహాలోనే నాన్న సెంటిమెంట్ తో వస్తుండగా..
ఈ సినిమా కోసం అయితే అందరిలో ఆసక్తి నెలకొంది. ఇక ఇప్పుడు ఈ సినిమా నుంచి చిత్ర యూనిట్ టీజర్ ని అయితే రిలీజ్ చేసారు, మరి ఈ టీజర్ బాగుంది కానీ అంత గొప్పగా అయితే లేదని చెప్పవచ్చు. తన కూతురుతో సీన్స్ కాస్త రొటీన్ గానే ఉన్నాయి. ఇక హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తో సీన్స్ మాత్రం కొంచెం బెటర్ అని చెప్పాలి.
పైగా ఇద్దరి మధ్యలో లిప్ లాక్ సీన్స్ ఎక్కువే ఉన్నట్టుగా ఈ టీజర్ చూస్తే అర్ధం అవుతుంది. లాస్ట్ టైం శ్యామ్ సింగ రాయ్ లో హీరోయిన్ కృతి శెట్టి తో లిప్ లాక్ సీన్స్ చేసిన నాని మళ్ళీ ఈ చిత్రానికి కూడా చేసాడు. సో దీని రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.
కాగా ఈ సినిమాని శౌర్యువ్ అనే కొత్త కుర్రాడు దర్శకత్వం వహిస్తుండగా అతనిపై నాని ఎక్కువ నమ్మకాన్నే పెట్టుకున్నాడు. కానీ అదైతే టీజర్ లో కనిపించలేదు. అలాగే మ్యూజిక్ కూడా అంత ఎమోషనల్ గా ఫీల్ అయ్యిపోయే రేంజ్ లో కూడా లేదు. ఇక ఫైనల్ గా అయితే టీజర్ తో సినిమాని రిలీజ్ డేట్ ని చేంజ్ చేసినట్టుగా మాత్రం కన్ఫర్మ్ చేశారు. దీనితో ఈ సినిమా డిసెంబర్ 7కి వచ్చేసింది.