ఓ వైపు రష్మీకి ఘాటు ముద్దు.. మరో వైపు చేతిలో మందు.. లక్ అంటే నందుదే!!

సింగర్ గీతా మాధురి భర్త నందు ప్రస్తుతం వార్తల్లో నిలుస్తూ తెగ హల్చల్ చేస్తున్నాడు. సవారి చిత్రంతో హీరోగా మారి తన లక్‌ను పరీక్షించుకున్నాడు. అయితే ఆ చిత్రం అనుకున్నంతగా సక్సెస్ కాలేదు. దీంతో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ముందుకు వస్తున్నాడు. బొమ్మ బ్లాక్ బస్టర్ అంటూ ఈ సారి దుమ్ములేపేందుకు రెడీ అవుతున్నాడు. ఈ మూవీ టైటిల్ పోస్టర్ నుంచి ప్రతీ ఒక్కటి డిఫరెంట్‌గా ప్లాన్ చేసి విడుదల చేస్తున్నారు.

Nandu Rashmi Bomma Blockbuster First Single Raaye nu Raaye
Nandu Rashmi Bomma Blockbuster First Single Raaye nu Raaye

బీబీ అంటూ బిగ్ బాస్ సందడి నడుస్తున్న సమయంలోనే తన బొమ్మ బ్లాక్ బస్టర్ (బీబీ) గురించి ప్రచారం చేసుకున్నాడు. ఆ స్ట్రాటజీ కూడా బాగా వర్కవుట్ అయింది. బొమ్మ బ్లాక్ బస్టర్ అనే చిత్రం ఒకటి ఉందని ప్రతీ ఒక్కరికీ తెలిసిపోయింది. ఇక టీజర్ కూడా ఓ రేంజ్‌లో క్లిక్ అయింది. అందులో రష్మీ, నందుల కెమిస్ట్రీ వేరే లెవెల్‌లో ఉన్నట్టు కనిపిస్తోంది. ఫస్ట్ లుక్‌లతోనే ఇద్దరూ కట్టిపడేశారు. వాణి పాత్రలో రష్మీ, పోతురాజు క్యారెక్టర్‌లో నందు జీవించేశారని తెలుస్తోంది.

Nandu Rashmi Bomma Blockbuster First Single Raaye nu Raaye
Nandu Rashmi Bomma Blockbuster First Single Raaye nu Raaye

గొడవలంటే చాలా ఇష్టమండి అంటూ వయ్యారంగా డైలాగ్ చెప్పిన రష్మీ అందర్నీ కట్టిపడేసింది. వాణి పాత్ర రష్మీకి మంచి పేరు తెచ్చిపెట్టేలా ఉంది. అయితే ఈ సినిమాలో ఈ ఇద్దరి రొమాన్స్ ఓ రేంజ్‌లో ఉండబోతోన్నట్టు కనిపిస్తోంది. తాజాగా ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ ‘రాయే నువ్ రాయే’ అనే పాట రాబోతోందంటూ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో రష్మీకి నందు ఘాటుగా ఘడంగా ముద్దు పెట్టాడు. మరో వైపు రష్మీ మందులో నీళ్లు కలుపుతోంది. మొత్తానికి నందు లక్కీ ఫెల్లో అనేలానే ఈ పోస్టర్ ఉంది.