అర్దరాత్రి అడవిలో.. నందినీ రాయ్ రచ్చ మామూలుగా లేదు!!

Nandini Rai Enjoys Nature In Rajahmundry

బిగ్‌బాస్ బ్యూటీ నందినీ రాయ్ సోషల్ మీడియాలో చేసే రచ్చ గురించి అందరికీ తెలిసిందే. సినిమాలతో వచ్చిన గుర్తింపు కంటే బిగ్ బాస్ షో ద్వారా వచ్చిన క్రేజే అధికం. అలా వచ్చిన గుర్తింపును సోషల్ మీడియాలో రచ్చ చేస్తూ కాపాడుకుంటోంది. ఇక ఈ అమ్మడు షేర్ చేసే ఫోటోలు నెట్టింట్లో వేడిని పుట్టిస్తూ ఉంటాయి. హాట్ హాట్ ఫోటో షూట్‌లతో నెటిజన్లకు కిక్కిస్తూ ఉంటుంది. తాజాగా ఈమె షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాల అగ్గి రాజేశాయి.

Nandini Rai Enjoys Nature In Rajahmundry
Nandini Rai Enjoys Nature In Rajahmundry

ఇక ఆ మధ్య టాలీవుడ్‌లో తెలుగమ్మాయిలకు అవకాశాలు ఇవ్వరని, క్యాస్టింగ్ కౌచ్ ఎక్కడైనా ఉంటుందంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఏదైనా మన మీదే ఆధారపడి ఉంటుందని, మనం ఒప్పుకుంటేనే ఏదైనా జరుగుతుందని బోల్డ్‌గా చెప్పేసింది. తనకెప్పుడూ అలాంటి పరిస్థితులు ఎదుర్కొలేదని చెప్పుకొచ్చింది. తెలుగమ్మాయిలకు టాలీవుడ్‌లో విలువ ఉండదని, అదే పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి మర్యాద ఇస్తారని చేసిన కామెంట్లు అప్పట్లో తెగ సెన్సేషన్ అయ్యాయి.

తాజాగా ఈ సుందరి రాజమండ్రిలో పాగా వేసింది. అక్కడి గోదావరిని చూస్తూ పులకరించింది. గోదావరి గట్టును చూస్తూ ఫుల్ ఎంజాయ్ చేసింది. అయితే అర్దరాత్రి తన స్నేహితురాళ్లతో కలిసి అడవి గుండా ప్రయాణం చేసింది. మరి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లింది? ఎందుకోసం వెళ్లింది? ఏ సినిమా షూటింగ్ కోసం వెళ్లింది? అన్న విషయాలేవీ పేర్కొనలేదు. మొత్తానికి అలా ప్రయాణం చేయడం ఓ అడ్వెంచర్‌లా ఉందని వారంతా ముచ్చటించుకున్నారు.