నందమూరి మోక్షజ్ఞ తెరంగేట్రమెప్పుడంటే.?

బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి మోక్షజ్ఞ తెరంగేట్రం చేస్తాడన్న ప్రచారం గతంలో జరిగింది. ‘స్కంద’ సినిమా రిజల్ట్ చూశాక, ఆ ప్రయత్నాన్ని నందమూరి బాలకృష్ణ విరమించుకున్నాడంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇప్పుడేమో అనిల్ రావిపూడి పేరు ప్రచారంలోకి వస్తోంది. ‘భగవంత్ కేసరి’ సినిమా సమయంలోనే, మోక్షజ్ఞ కోసం ఓ స్క్రిప్ట్ బాలయ్యకు వినిపించాడట అనిల్ రావిపూడి. ఆ స్క్రిప్ట్ విషయంలో బాలయ్య ఇంప్రెస్ అయ్యాడనీ అంటున్నారు.

అనిల్ రావిపూడి స్క్రిప్టుకి అవసరమైన విధంగానే, మోక్షజ్ఞ కొన్ని రకాల శిక్షణలు తీసుకుంటున్నాడట.. కామెడీ వంటి విభాగాల్లో. అన్నీ అనుకున్నట్టు జరిగితే, ‘భగవంత్ కేసరి’ సినిమా విడుదల రోజునే మోక్షజ్ఞ తెరంగేట్రంపై ప్రకటన వుంటుందట.

నిజమేనా.? నమ్మొచ్చా.? అంటే, బాలయ్యకి సెంటిమెంట్లు ఎక్కువ. విజయదశమి పర్వదినాన, తన కుమారుడి సినిమాకి సంబంధించిన ప్రకటన ఇవ్వాలని ఆయనా అనుకుంటుంన్నాడన్నది ఇన్‌సైడ్ సోర్సెస్ కథనం.

మరోపక్క, ఇంకో ఇద్దరు దర్శకులు చెప్పిన కథల్నీ బాలయ్య తన కుమారుడి కోసం రెడీ చేయించాడని అంటున్నారు.