బాలయ్య కూడా ఆమెను లైన్లో పెడుతున్నాడట.!

బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతెలా తెలుగులో జోరు పెంచింది. ఒకప్పుడు బాలీవుడ్ ముద్దుగుమ్మలు తెలుగులో సినిమాలో చేసేందుకు తటపటాయించేవారు. కానీ, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తెలుగు సినిమాలంటే చాలు, ఒక్క ఛాన్స్.. ఒకే ఒక్క ఛాన్స్ అంటూ క్యూ కడుతున్నారు నార్త్ భామలు.

ఎలాంటి ఛాన్స్ దొరికినా అస్సలు మిస్ చేసుకునే సాహసం చేయడం లేదు. ఆ కోవలో ఊర్వశి రౌతెలా తెలుగులో యమా జోరు పెంచింది. స్పెషల్ సాంగ్స్‌తో స్టార్ట్ చేసి, ఇప్పుడు చిన్న చిన్న రోల్స్.. అది కూడా వ్యాంప్ రోల్స్ అయినా సై సై అంటోంది. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవితో ‘వాల్తేర్ వీరయ్య’లో స్పెషల్ స్టెప్పులేసేసింది. తర్వాత బోయపాటి సినిమాలో రామ్ పోతినేని సరసన ఐటెమ్ చిందులేసేందుకు రెడీ అవుతోంది.

తాజాగా బాలయ్య సినిమాకీ డేట్స్ ఇచ్చేసిందనీ ఇన్‌సైడ్ సోర్సెస్ ద్వారా అందుతోన్న వేల్యూబుల్ సమాచారమ్. బాలయ్య – అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రాబోయే సినిమాలో ఊర్వశి కోసం ఓ స్పెషల్ మసాలా సాంగ్ డిజైన్ చేయబోతున్నారట. అలాగే ఓ వ్యాంప్ రోల్ కూడా క్రియేట్ చేయాలనుకుంటున్నాడట అనిల్ రావిపూడి. ఒకవేళ అదే జరిగితే, పాప ఇప్పట్లో టాలీవుడ్‌ని ఖాళీ చేసేదేలే.! అన్నట్లు అప్పుడెప్పుడో ‘బ్లాక్ రోజ్’ అనే తెలుగు సినిమాలో నటించింది ఊర్వశి రౌతెలా. ఇదే హుషారులో ఆ సినిమా స్టేటస్ కూడా ముందుకు కదిలే అవకాశాలున్నాయ్ మరి.