గుంటూరు లో నందమూరి బాలకృష్ణ – ఇక దబిడి దిబిడే !

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బీబీ3 తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. లాక్ డౌన్ కారణంగా ఆగిపోయిన షూటింగ్ మళ్ళీ మొదలై నాన్ స్టాప్ గా జరుగుతోంది. కాగా ఫిబ్రవరి రెండవ వారం నుండి కొత్త షెడ్యూల్ మొదలు పెట్టబోతున్నారని సమాచారం. అయితే తాజా సమాచారం ప్రకారం.. బోయపాటి శ్రీను త్వరలో మొదలయ్యే షెడ్యూల్ గుంటూరులో ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. ఇప్పటికే టీజర్ తో భారీ అంచనాలు క్రియేట్ చేసిన బాలయ్య – బోయపాటిల సినిమా ఈపాటికే రిలీజ్ కావాల్సింది.

ఇక బాలయ్య – బోయపాటి శ్రీనుల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ హ్యాట్రిక్ సినిమా రిలీజ్ ఎప్పుడెప్పుడా అని అటు నందమూరి అభిమానులు ఇటు ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే మే 28న సినిమాను థియేట్రికల్ రిలీజ్ చేయనున్నట్లు రీసెంట్ గా ప్రకటించారు దర్శక నిర్మాతలు. బోయపాటి ఇప్పటికే సింహ, లెజెండ్ సినిమాల తో భారీ హిట్స్ ఇచ్చాడు. దాంతో ఇప్పుడు బాలయ్య బీబీ3 మీద భారీగా అంచనాలు పెట్టుకున్నారు. అందుకు కారణం బాలయ్య అని బోయపాటి చూపించే విధానమే.

కాగా ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ లో మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా బాలయ్య కి జంటగా హీరోయిన్లుగా ప్రగ్యా జైస్వాల్ పూర్ణలు నటిస్తున్నారు. ప్రస్తుతం రెండు బ్లాక్ బస్టర్స్ అందించిన బోయపాటి శ్రీను దర్శకత్వంలో మూడోసారి రాబోతున్న మరో హిట్ అని గట్టిగా నమ్మకం పెట్టుకున్నారు. ఇక ఈ సినిమాలో బాలయ్య డ్యూయెల్ రోల్ చేస్తున్నట్లు సమాచారం. మరి ఈసారి ఎలా చూపించనున్నాడో బోయపాటి అంటూ అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇక ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు.